ఆన్‌లైన్‌ సెల్‌ బుకింగ్‌తో మోసం | online moblile booking froud out in warangal district | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ సెల్‌ బుకింగ్‌తో మోసం

Published Sat, Aug 13 2016 5:10 PM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

ఆన్‌లైన్‌ సెల్‌ బుకింగ్‌తో మోసం - Sakshi

ఆన్‌లైన్‌ సెల్‌ బుకింగ్‌తో మోసం

తొర్రూరు (వరంగల్): ఆన్‌లైన్‌ సెల్‌ బుకింగ్‌తో ఓ యువకుడు మోసపోయాడు. తొర్రూరు పట్టణానికి చెందిన ఆబోతు కుమార్‌ అనే యువకుడు సుమారు రూ. 18,500 విలువ చేసే సామ్‌సంగ్‌ సెల్‌ కోసం గతవారం రోజుల క్రితం అన్‌లైన్‌లో బుకిం గ్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో సామ్‌సంగ్‌ షోరూం హైదరాబాద్‌ నుంచి శుక్రవారం మధ్యాహ్నం తొర్రూరుకు వచ్చిన ఫ్యాకింగ్‌ను తీసుకుని తెరిచి చూశాడు.

 అందులో సామ్‌సంగ్‌ సెల్‌కు బదులు ఇనుప ముక్కతోపాటు పాతకాలం నాటి సుమారు రూ.2 వేల విలువ చేసే నోకియా సెల్, బ్యాట్రీ ఉండడంతో యువకుడు కుమార్‌ ఆందోళనకు గురయ్యాడు. సంబంధిత కంపెనీవారిని సమాచారం అందించినా ఏలాంటి ప్రయోజనం లేకపోవడంతో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement