Sandeep Saxena
-
సక్సేనా అవుట్?
సాక్షి, చెన్నై : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సందీప్ సక్సేనా బదిలీ సచివాలయంలో చర్చకు దారితీసింది. ఆయన్ను హఠాత్తుగా ఢిల్లీకి బదిలీ చేశారంటూ సంకేతాలు వెలువడ్డాయి. అయితే, తనకు ఎలాంటి సమాచారం లేదని సక్సేనా స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఇదివరకు పనిచేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌ను తనను బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు విముక్తి కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్ 27న అప్పటి వ్యవసాయ శాఖ కమిషనర్‌గా ఉన్న సందీప్ సక్సేనాను నియమించారు. సక్సేనా బాధ్యతలు చేపట్టినానంతరం శ్రీరంగం, ఆర్కే నగర్ ఉప ఎన్నికలు జరిగాయి. ఆయన బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కసరత్తుల్లో సక్సేనా బిజీగానే ఉన్నారు. అదే సమయయంలో ఈ ఏడాది కాలంలో సందీప్ సక్సేనా పనితీరుపై ప్రతి పక్షాలు తీవ్రంగా దుయ్యబడుతూ వస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ప్రతి పక్షాల మద్దతుదారుల ఓట్ల గల్లంతు వివాదానికి దారితీసింది. ప్రధానంగా డీఎంకే ఓటు బ్యాంక్ మీద ప్రభావం చూపించే రీతిలో ఆ జాబితా ఉండడంతో ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సక్సేనా అధికార అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బయలుదేరాయి. ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించేందుకు వీలులేదని, బదిలీ చేసి మరొకర్ని నియమించాల్సిందేన న్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. సక్సేనాపై వచ్చిన ఫిర్యాదుల్ని కేంద్రం ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకునట్టు మంగళవారం సంకేతాలు వెలువడ్డాయి. బదిలీ ప్రచారం : సక్సేనాను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసినట్టుగా బుధవారం ప్రచారం బయలు దేరింది. దీనికి తోడు ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జ్ఞాన దేశికన్‌కు లేఖ వచ్చినట్టు సంకేతాలు రావడంతో సక్సేనా బదిలీ చేయబడ్డట్టేనా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఆయన్ను ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపినట్టు సమాచారం పొక్కింది. కొత్త ఈసీ ఎంపికకు సంబంధించిన ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లతో జాబితాను ఢిల్లీకి పంపించాలని ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చిందన్న సమాచారంతో కొన్ని మీడియాలు అత్యుత్సాహం ప్రదర్శించాయి. సక్సేనా బదిలీ అంటూ, ప్రతి పక్షాల దెబ్బకు ఆయన బదిలీ చేయబడ్డట్టుగా హంగామా సృష్టించాయి. మీడియాల్లో వచ్చిన కథనాలతో సక్సేనా విస్మయంలో పడక తప్పలేదు. సచివాలయం చేరుకున్న సక్సేనా మీడియాల్లో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలుగా తేల్చారు. తానెక్కడికీ బదిలీ కాలేదని, తనకు ఎలాంటి సమాచారమే లేదని స్పష్టం చేశారు. ఏ ప్రాతిపదికన తాను బదిలీ అంటూ హంగామా సృష్టించారంటూ మీడియాను ప్రశ్నించారు. ఓటర్ల జాబితా విషయంగా గురువారం తాను మీడియాను కలవబోతున్నట్టు వ్యాఖ్యానించారు. -
ఉద్వాసన పలకాల్సిందే
సాక్షి, చెన్నై :అధికార పక్షానికి తొత్తుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారి సందీప్ సక్సేనాను ఆ పదవి నుంచి తొలగించాల్సిందేనని పీఎంకే కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈసీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టేందుకు సిద్ధమైంది. అలాగే, అన్నదాతల ఆత్మహత్యల నివారణ లక్ష్యంగా రుణాల రద్దుకు ప్రభుత్వంపై ఒత్తిడికి నిర్ణయించింది. దిండి వనంలోని తైలాపురం తోట్టంలో పీఎంకే రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు అధ్యక్షతన ఆ పార్టీ కూటమి సీఎం అభ్యర్థి అన్భుమణి రాందాసు, పార్టీ అధ్యక్షుడు జీకే మణి, కేంద్ర మాజీ మంత్రులు ఏవీ వేలు, ఏకే మూర్తిల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం, పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతూ, ప్రజల్లోకిచొచ్చుకు వెళ్లడం లక్ష్యంగా కార్యక్రమాల విస్తృతానికి ఈ సమావేశంలో కార్యచరణను సిద్ధం చేశారు. అలాగే, త్వరలో జరగనున్న పార్టీ మహానాడు విజయవంతం లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఈసీపై ధ్వజం: ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా తీరుపై ఈ సమావేశంలో ధ్వజమెత్తారు. అధికార పక్షానికి తొత్తుగా ఆయన వ్యవహరిస్తున్నారని, ఆయన నేతృత్వంలో 2016 ఎన్నికలు జరిగేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఆయనకు ఉద్వాసన పలికి, నీతి నిజాయితీకి కట్టుబడి పనిచేసే అధికారిని ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించాలని డిమాండ్ చేశారు. ఆయన్ను తొలగించాలని పట్టుబడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చే విధంగా పోరు బాటకు సిద్ధం కానున్నారు. కులాల వారిగా జనగణనను వివరాలను త్వరితగతిన వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సొంత స్థలం కూడా లేని కుటుంబాలు కోట్లల్లో ఉన్నాయని, కూలి కార్మికులుగా బతుకు జీవనం సాగిస్తున్న వాళ్లను బలోపేతం చేయడానికి సరికొత్త ఉపాది కార్యక్రమాలను విస్తృత పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే, భూ సేకరణ చట్టం అమలు ప్రయత్నాన్ని వీడాలని, అన్నదాతల ఆత్మహత్యల నివారణ లక్ష్యంగా వారు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే సమావేశంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం లక్ష్యంగా ప్రజల్లో చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలకు కార్యచరణ సిద్ధం చేస్తూ తీర్మానాలు ప్రవేశ పెట్టారు. -
2,758 కోట్లకు హోమియో మార్కెట్
♦ ఇందులో సంఘటిత రంగం వాటా ♦ కేవలం రూ.270 కోట్లు ♦ దీర్ఘకాలిక వ్యాధులను కూడానయం చేయొచ్చు ♦ డాక్టర్ బాత్రాస్ గ్రూప్ సీఈఓ సందీప్ సక్సేనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి వైద్యానికి డిమాండ్ ఉందని, కేన్సర్, రక్తనాళాల వ్యాధుల వంటి దీర్ఘకాలిక రోగాలకు సైతం హోమియోపతి వైద్యంలో చికిత్స ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైనట్లు డాక్టర్ బాత్రాస్ గ్రూప్ సీఈఓ సందీప్ సక్సేనా చెప్పారు. దేశంలో హోమియోపతి మార్కెట్ రూ.2,758 కోట్లకు చేరిందని.. కాకపోతే ఇందులో సంఘటిత రంగం వాటా కేవలం రూ.270 కోట్లని.. మిగతాదంతా అసంఘటిత రంగానిదేనని చెప్పారాయన. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రూప్ విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. ఇంకా ఏమన్నారంటే... ► ప్రస్తుతం డాక్టర్ బాత్రాస్కు దేశంలో 200, దుబాయ్‌లో 3, లండన్‌లో 2, ఢాకాలో ఒకటి చొప్పున క్లినిక్‌లు ఉన్నాయి. ఇందులో 140 సొంతవి కాగా మిగతావి ఫ్రాంచైజీ. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలో మరో 51, విదేశాల్లో 11 క్లినిక్స్‌ను తెరుస్తాం. 2020 నాటికి రూ.1,000 కోట్ల టర్నోవర్‌తో మొత్తం 450 క్లినిక్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. రెండు నెలల్లో గల్ఫ్ దేశాల్లో మరో 5 క్లినిక్స్‌ను ప్రారంభిస్తాం. ► ఈ ఏడాది రూ.25 కోట్ల పెట్టుబడితో క్లినిక్స్, స్టోర్లను ప్రారంభించనున్నాం. మూడేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం. గతేడాదితో పోల్చితే 2014-15 ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధి రేటుతో రూ.200 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 10 శాతంగా ఉంది. మొత్తం టర్నోవర్‌లో డాక్టర్ బాత్రాస్ వాటా 78 శాతం, హెయిర్ ట్రీట్మెంట్, ఎఫ్ఎంసీజీ విభాగాల వాటా 22 శాతంగా ఉంది. ► గతేడాది డాక్టర్ బాత్రాస్ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించాం. ప్రస్తుతానికి షాంపూ, జుట్టు, చర్మ సంబంధిత చికిత్సలకు సంబంధించి 38 ఉత్పత్తులున్నాయి. స్టోర్ల విషయానికొస్తే మన దేశంలో 6,500, దుబాయ్‌లో 220 ఉన్నాయి. గతేడాది రూ.50 కోట్ల వ్యాపారాన్ని చేశాం. ► హోమియోపతి రంగంలో లక్ష మంది వైద్యులు, 100 మిలియన్ల మంది చికిత్స పొందుతున్నారు. దశాబ్ద కాలంలో డాక్టర్ బాత్రాస్ గ్రూప్‌లో 1.3 మిలియన్ల మంది చికిత్స చేయించుకున్నారు. ఇందులో 60% వాటా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కస్టమర్లదే.