Sandigo
-
బామ్మకు సలామ్...
92 ఏళ్ల వయస్సులో మారథాన్ పరుగు పూర్తి సాండిగో: ముదిమి మీద పడిన తరుణంలో ఎవరైనా ఏం చేస్తారు. పుస్తకాలు చదువుతూనో.. చిన్నపిల్లలతోనో కాలక్షేపం చేస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన 92 ఏళ్ల బామ్మ హారియెట్ థామ్సన్ మాత్రం మనం ఊహించలేని ఫీట్ చేసి చూపించింది. సాండిగోలో ఏర్పాటు చేసిన 16వ రాక్ ఎన్ రోల్ మారథాన్‌ను ఏడు గంటల 24 నిమిషాల 36 సెకన్లలో పూర్తి చేసి అందరినీ అబ్బురపరిచింది. నార్త్ కరోలినాలోని చార్లెట్‌కు చెందిన తను ఈ క్రమంలో మారథాన్ (42.195 కిలోమీటర్లు)ను పూర్తి చేసిన అత్యంత వృద్ధ మహిళ (92 ఏళ్ల 65 రోజులు)గా రికార్డులకెక్కింది. గతంలో ఈ రికార్డు గ్లాడిస్ బురిల్ (92 ఏళ్ల 19 రోజులు) పేరిట ఉండేది. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ రేసు పూర్తి చేసేందుకు చాలామంది ప్రోత్సహించారు. నిజానికి ఈ ఏడాది నాకు విషాదాన్నే నింపింది. జనవరిలో నా భర్త చనిపోయారు. అందుకే నేను పెద్దగా శిక్షణ తీసుకోలేకపోయాను. నా కుటుంబంలో చాలా మంది క్యాన్సర్ కారణంగా చనిపోయారు. నేను కూడా అలాగే చనిపోతాననుకున్నాను’ అని ఈ ప్రమాదకర వ్యాధి నుంచి కోలుకున్న హారియెట్ తెలిపారు. ల్యుకేమియా, లిమ్ఫోమా వ్యాధులపై పోరాడేందుకు నిధుల కోసం ఏడు పదుల వయస్సులో ఆమె తను పరుగును ప్రారంభించింది. గత 16 ఏళ్లలో ఆమె లక్ష డాలర్లను (రూ. 63 లక్షలు) సేకరించింది. -
పొర్లుపాట్లు...
‘‘పారాడుతుంటే పాపాయిలనుకున్నాం... తాపం ఓపలేకున్న పాపులని తెలుసుకున్నాం’’ అంటూ నోరెళ్లబెట్టారు చూసినోళ్లు. అమెరికాలోని శాన్‌డిగోలో ఉన్న చులా విస్టా ప్రోమ్ డ్రెస్ స్టోర్... రద్దీ షాపింగ్‌మాల్స్‌లో ఒకటి. ఆ మాల్లో మిట్ట మధ్యాహ్నం వేళ... ఓ దృఢకాయుడైన యువకుడు మాల్లోని ఖాళీ స్థలంలో చాపచుట్టలా పొర్లుతుంటే చూసిన షాపర్స్ పిల్లతనం పోనిద్దూ అనుకున్నారు. అయితే ఉత్సాహవంతురాలైన క్రిస్టీ పీటర్సన్ అనే యువతి సదరు పొర్లుడు సీన్‌ని చూసి తెగ ముచ్చటపడి మొబైల్లో వీడియో తీస్తూ... కాసేపటికే కెవ్కెవ్మని కేకలేసింది. దీంతో ఆమె అరుపులు, కేకలవైపు కాస్త పరిశీలనగా చూసిన వాళ్లంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎందుకంటే ఆమె అప్పటిదాకా వీడియో తీసింది దొర్లుతున్న యువకుడిని కాదు, అతనితో పాటు మరో మహిళ కూడా ఉంది! అంతేనా... అంతా చూస్తూండగానే వారిద్దరూ ‘‘నవ్విపోదురూ మాకేటి సిగ్గ’’న్నట్టు సిగ్గు ఎగ్గూతో పాటు బట్టలు కూడా విడిచేసి సృష్టికార్యం మొదలుపెట్టేశారు. దీంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులొచ్చి‘‘మీవి కాదు కదా పొర్లుదండాలు... మేమేస్తాం చూడండిపుడు అరదండాలు’’అంటూ ఆ జంటని పోలీస్‌స్టేషన్‌కి పట్టుకుపోయారు. సదరు యువకుడి వయసు 21 కాగా అతనితో ‘కలిసి’ మెలిసిన మహిళకి 37... ఆ మాల్లోనే తొలిసారి వారిద్దరూ కలిశారని కనీసం పరస్పరం పేర్లు కూడా తెలియవనేది కొసమెరుపు.