పొర్లుపాట్లు... | Vista Prom Dress Store | Sakshi
Sakshi News home page

పొర్లుపాట్లు...

Published Tue, Feb 17 2015 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

Vista Prom Dress Store

‘‘పారాడుతుంటే పాపాయిలనుకున్నాం... తాపం ఓపలేకున్న పాపులని తెలుసుకున్నాం’’ అంటూ నోరెళ్లబెట్టారు చూసినోళ్లు. అమెరికాలోని శాన్‌డిగోలో ఉన్న చులా విస్టా ప్రోమ్ డ్రెస్ స్టోర్... రద్దీ షాపింగ్‌మాల్స్‌లో ఒకటి. ఆ మాల్‌లో మిట్ట మధ్యాహ్నం వేళ...  ఓ దృఢకాయుడైన యువకుడు మాల్‌లోని ఖాళీ స్థలంలో చాపచుట్టలా పొర్లుతుంటే  చూసిన షాపర్స్ పిల్లతనం పోనిద్దూ అనుకున్నారు. అయితే ఉత్సాహవంతురాలైన క్రిస్టీ పీటర్సన్ అనే యువతి సదరు పొర్లుడు సీన్‌ని చూసి తెగ ముచ్చటపడి మొబైల్‌లో వీడియో తీస్తూ... కాసేపటికే కెవ్‌కెవ్‌మని కేకలేసింది. దీంతో ఆమె అరుపులు, కేకలవైపు కాస్త పరిశీలనగా చూసిన వాళ్లంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ఎందుకంటే ఆమె అప్పటిదాకా వీడియో తీసింది దొర్లుతున్న యువకుడిని కాదు, అతనితో పాటు మరో మహిళ కూడా ఉంది! అంతేనా... అంతా చూస్తూండగానే వారిద్దరూ ‘‘నవ్విపోదురూ మాకేటి సిగ్గ’’న్నట్టు సిగ్గు ఎగ్గూతో పాటు బట్టలు కూడా విడిచేసి సృష్టికార్యం మొదలుపెట్టేశారు. దీంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులొచ్చి‘‘మీవి కాదు కదా పొర్లుదండాలు... మేమేస్తాం చూడండిపుడు అరదండాలు’’అంటూ ఆ  జంటని పోలీస్‌స్టేషన్‌కి పట్టుకుపోయారు. సదరు యువకుడి వయసు 21 కాగా అతనితో ‘కలిసి’ మెలిసిన మహిళకి 37... ఆ మాల్‌లోనే తొలిసారి వారిద్దరూ కలిశారని కనీసం పరస్పరం పేర్లు కూడా తెలియవనేది కొసమెరుపు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement