బావిలో పడి మతిస్థిమితం లేని యువకుడి మృతి
పల్లారుగూడ(సంగెం) : మతిస్థిమితం లేని ఓ యువకుడు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందిన సంఘటన సం గెం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పల్లారుగూడ శివారు వీఆర్ఎన్ తండాకు చెందిన గుగులోత్ చిన్ని, భద్రు దంపతు లకు కుమారులు సారయ్య(25), చిరంజీవి, కూతురు సునిత ఉన్నారు. పెద్దవాడైన సారయ్యకు మతిస్థిమితం సరిగా లేదు. పలుమార్లు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వెళ్లి తనంతట తానుగా తిరిగి వచ్చేవాడు. ఇదే మాదిరి గా 15న మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లాడు కానీ తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం తమ్ముడు చిరంజీవి వ్యవసాయ పనుల నిమిత్తం చేను వద్దకు వెళ్లాడు. సమీపం లో ఉన్న తాగునీటి బావిలో నీళ్లు చేదడానికి బకెట్ వేసి చూడ గా అన్న సారయ్య శవం కనిపించింది. వెంటనే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. మృతుడి తండ్రి భద్రు ఫిర్యాదు మేరకు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు పీఎస్సై ఎం.రాజు తెలిపారు. కాగా, మృతుడి కుటుంబాన్ని ఎంపీపీ బొమ్మల కట్టయ్య పరామర్శించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బావిలోని నీటిని పూర్తిగా తీసివేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రపరిచిన తర్వాతనే నీటి సరఫరా చేస్తామని సర్పంచ్ అరుణ తెలిపారు.