శాన్వి కపిల్యకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే జరిగిన జాతీయ యోగా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి శాన్వి కపిల్య సత్తా చాటింది. కోల్‌కతాలోని హౌరా మున్సిపల్ స్టేడియంలో జరిగిన యోగా పోటీల్లో 6-10 వయో విభాగం కేటగిరీలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇది ఆమెకు వరుసగా రెండో స్వర్ణం. 2015లో కోల్‌కతాలోని బరాసత్‌లో జరిగిన జాతీయ యోగా చాంపియన్‌షిప్‌లోనూ ఆమె పసిడి పతకాన్ని సాధించింది. ప్రస్తుతం శాన్వి అత్తాపూర్‌లోని బ్రిగేడ్ పబ్లిక్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది.