బంగారానికి మెరుగుపెడతామని..
ముప్పాళ్ల : బంగారానికి మెరుగుపెడతామని చెప్పి బంగారం దోచుకున్న సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వచ్చి బంగారం మెరుగు పెడతామనడంతో తన దగ్గర ఉన్న 8 సవర్ల బంగారాన్ని ఇచ్చానని..చూసుకునే లోపలే దుండగులు పరారైనట్టు బాధితురాలు సరసమ్మ తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ముప్పాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.