అదృష్టదీపక్‌కు సత్కారం
రామచంద్రపురం :
విజయవాడ స్వరా జ్య మైదా¯ŒSలో జరిగిన జాతీయ పుస్తక మహోత్సవంలో తనను ఘనంగా సత్కరించినట్టు ప్రముఖ సినీ గేయ రచయిత, కవి, విమర్శకుడు అదృష్టదీపక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం, ఎన్టీఆర్ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యాన జరిగిన ఈ మహోత్సవంలో ‘రచయితల సాహిత్యానుభవాలు’ అనే కార్యక్రమం నిర్వహించారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది పైగా కవులు తమ సాహిత్యానుభావాలను సాహితీ అభిమానులతో పంచుకున్నారన్నారు. ఇందులో హాస్యావధాని శంకరనారాయణ, చంద్రలత, అమ్ముంగి వేణుగోపాల్, ఎలనాగ, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నామాడి శ్రీధర్, దేవదానంరాజు తదితర కవులతోపాటు తానూ పాల్గొన్నట్లు అదృష్టదీపక్ తెలిపారు. సభానంతరం డాక్టర్ జీవీ పూర్ణచందు, బండ్ల మాధవరావు, గుత్తికొండ సుబ్బారావు, ఎక్స్‌రే కొల్లూరి, ఎమెస్కో విజయకుమార్ తదితరుల చేతుల మీదుగా సత్కారం అందుకున్నట్లు ఆయన వివరించారు.