Save Dharna Chowk
-
పవన్‌తో తమ్మినేని చర్చలు..
‘సేవ్ ధర్నాచౌక్’కు మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్ సాక్షి, హైదరాబాద్: సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సీపీఎం కార్య దర్శి తమ్మినేని వీరభద్రం భేటీ అయ్యారు. గురువారం జరిగిన ఈ సమావేశంలో రెం డు తెలుగు రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామా లపై చర్చించినట్లు తమ్మినేని మీడియాకు తెలిపారు. ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ లో భాగంగా ఈనెల 15న నిర్వహించనున్న ధర్నాచౌక్ ఆక్రమణకు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారన్నారు. సేవ్ ధర్నా చౌక్‌కు మద్దతు: పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై అసంతృప్తి తలెత్తితే దానిని వెలిబుచ్చే స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కు ఆ ప్రజలకు ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు. గతంలో భీంరావుబాడ విషయంలో ప్రజారాజ్యం తరఫున ధర్నాచౌక్‌లో తాము ఆందోళనలు నిర్వహించామన్నారు. సేవ్ ధర్నాచౌక్ పేరిట నిర్వహిస్తున్న ప్రదర్శనకు మద్దతునిస్తున్నామన్నారు. పవన్‌తో చర్చలపై సమాచారం లేదు: చాడ పవన్‌తో తమ్మినేని చర్చల విషయంలో తమకు సమాచారం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెల్లడించారు. ధర్నాచౌక్ ఉద్యమానికి ఎవరు మద్దతిచ్చినా తీసు కుంటామన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి విధివిధానాలను ప్రకటించాకే కలసి పనిచేసే విషయంపై ఆలోచిస్తామన్నారు. -
రాచరికాన్ని పూడ్చిన గడ్డ తెలంగాణ
మల్లు స్వరాజ్యం సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాచరి కాన్ని మళ్లీ తేవాలనుకుంటే అది ఆయన వల్ల కాదని, రాచరికాన్ని, తానీషాలనే పూడ్చి పెట్టిన ఘనత తెలంగాణదని సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అ న్నారు. కేసీఆర్‌కు ప్రగతిభవన్ ఎంత ముఖ్య మో.. తెలంగాణ ప్రజలకు ధర్నాచౌక్ కూడా అంతే ముఖ్యమన్నారు. సేవ్‌ధర్నాచౌక్ పేరు తో మఖ్థూం భవన్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరసన దీక్షలు 11వ రోజుకు చేరుకు న్నాయి. మంగళవారం దీక్షలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, వర్కింగ్ ఉమెన్స్ ఫోరం, పీఓడబ్ల్యూ స్త్రీ విముక్తి, మహిళా రైతు హక్కుల వేదిక, ప్రగతిశీల మహిళా సంఘం, నేషనల్ అల యన్స్ ఫర్ పీపుల్ మూమెంట్ సంఘాలు పాల్గొన్నాయి. ఇందులో మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ... ధర్నాచౌక్‌ను ఎత్తివేసి సీఎం కేసీఆర్ తప్పు చేస్తున్నారన్నారు. విద్యావేత్త ప్రొఫెసర్ రమా మేల్కొటే మాట్లాడుతూ... అభివృద్ధి అంటే ప్రజల హక్కులను కాలరా యడం, భూములను లాక్కోవడమేనా అని ప్రశ్నించారు. టీజేఏసీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సామాజిక కార్యకర్త దేవి, ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ సభ్యులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఐద్వా నాయకురాలు జ్యోతి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్దన్, అంకురం సంస్థ ప్రతినిధి సుమిత్ర తదిత రులు పాల్గొని ప్రసంగించారు.