పవన్‌తో తమ్మినేని చర్చలు..
‘సేవ్ ధర్నాచౌక్’కు మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సీపీఎం కార్య దర్శి తమ్మినేని వీరభద్రం భేటీ అయ్యారు. గురువారం జరిగిన ఈ సమావేశంలో రెం డు తెలుగు రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామా లపై చర్చించినట్లు తమ్మినేని మీడియాకు తెలిపారు. ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ లో భాగంగా ఈనెల 15న నిర్వహించనున్న ధర్నాచౌక్ ఆక్రమణకు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారన్నారు.
సేవ్ ధర్నా చౌక్‌కు మద్దతు: పవన్ కల్యాణ్
ప్రభుత్వంపై అసంతృప్తి తలెత్తితే దానిని వెలిబుచ్చే స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కు ఆ ప్రజలకు ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు. గతంలో భీంరావుబాడ విషయంలో ప్రజారాజ్యం తరఫున ధర్నాచౌక్‌లో తాము ఆందోళనలు నిర్వహించామన్నారు. సేవ్ ధర్నాచౌక్ పేరిట నిర్వహిస్తున్న ప్రదర్శనకు మద్దతునిస్తున్నామన్నారు.
పవన్‌తో చర్చలపై సమాచారం లేదు: చాడ
పవన్‌తో తమ్మినేని చర్చల విషయంలో తమకు సమాచారం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెల్లడించారు. ధర్నాచౌక్ ఉద్యమానికి ఎవరు మద్దతిచ్చినా తీసు కుంటామన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి విధివిధానాలను ప్రకటించాకే కలసి పనిచేసే విషయంపై ఆలోచిస్తామన్నారు.