save plants
-
ధోని మెసేజ్‌పై అభిమానుల ఆగ్రహం.. ట్వీట్ వైరల్
సిమ్లా: టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్లా పర్యటనలో ఉన్న ధోని తన కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు. ప్రస్తుతం సిమ్లాలో ధోని ఉన్న ఇళ్లు పూర్తిగా చెక్కతో తయారుచేశారు. ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ శాతం ఇళ్లు చెక్కతోనే నిర్మిస్తారు. అక్కడి వాతావారణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించిన ధోని ఫోటోలను షేర్ చేస్తూనే 'చెట్లు నాటండి.. అడవులు కాపాడండి' అంటూ మెసేజ్ ఇచ్చాడు. ఈ మెసేజ్ ధోని అభిమానులను రెండుగా చీల్చింది. ఒక వర్గం ధోనిని పొగిడితే.. మరో వర్గం మాత్రం ధోని చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. '' ఒకవైపు చెట్లను నరికి ఇల్లు కడుతున్న ధోనీ.. వేరే వాళ్లకు మాత్రం చెట్లు నాటమని సలహా ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ధోని ఆ ఇంటి నిర్మాణం కోసం ఎన్ని చెట్లను నరికావో చెప్పు'' అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సీఎస్కే స్పందింస్తూ 'ప్లాంటింగ్ ద రైట్ థాట్స్' అంటూ క్యాప్షన్ పెట్టింది. కాగా ఐపీఎల్ 2021 సీజన్లో సీఎస్కే జట్టును ఎంఎస్ ధోని విజయవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌ను మరిపిస్తూ చెన్నై ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. కాగా ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడుపుతున్న ధోని ఆగస్టులో సీఎస్కే టీంతో కలవనున్నాడు. చదవండి: పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని.. Planting the right thoughts! 💛 Thala 😍#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/rbZmSwGA2n — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) June 25, 2021 -
నాటిన ప్రతి మొక్కను కాపాడాలి
చందుర్తి (వేములవాడ) : హరితహారంలో నాటి ప్రతి మొక్కను కాపాడాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ కోరారు. రుద్రంగి మండల కేంద్రంలో హరితహారంలో నాటిన మల్బరీ తోటను శుక్రవారం పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధిహామీ వన నర్సరీని పరిశీలించి, ప్రతి మొక్కను ఎండి పోకుండా కాపాడి లక్ష్యాన్ని సాధించాలని ఉపాధిహామీ సిబ్బందికి సూచించారు. అలాగే ఉపాధిహామీలో నిర్మించిన పశువుల పాక, పశువుల తొట్టిని పరిశీలించి ఉపాధిహామీ సిబ్బంది పనితీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రభుత్వ లక్ష్యం వైపు ప్రతి ఒక్కరూ అడుగు వేయాలని కోరారు. ఆయన వెంట ఉపాధిహామీ పీడీ రవీందర్, ఏపీడీ మదన్మోహన్, మండల ప్రత్యేకాధికారి మోహన్‌రావు, ఎంపీడీవో శ్రీనివాస్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు దనుంజయ్ ఉన్నారు. అర్హులందరికీ పింఛన్లు.. అర్హులదరికీ వచ్చే నెల నుంచి పింఛన్లు తప్పకుండా అందిస్తామని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. మండలంలోని మానాల గ్రామంలో అర్హులకు పింఛన్ అందడం లేదనే ఫిర్యాదు మేరకు శుక్రవారం కలెక్టర్ ఆ గ్రామంలో స్వయంగా విచారణ చేపట్టారు. సాంకేతిక కారణాలతో పింఛన్లు అందడం లేదని.. వచ్చే నెల నుంచి అందజేస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్‌పై గ్రామస్తుల ఆగ్రహం కలెక్టర్ సాక్షిగా రుద్రంగి తహసీల్దార్ రమేశ్‌బాబుపై మానాల గ్రామస్తులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. సుమారు 60మందికిపైగా కల్యాణలక్ష్మి పథకానికి ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటికీ డబ్బులు అందలేదంటూ బుక్యా అమర్‌సింగ్, గుగలోతు రాజం, సుద్దపెల్లి గంగరాజం, సిద్దిమల్ల రాజం ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం లోపు పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి దరఖాస్తులను అందజేయాలని కలెక్టర్, తహసీల్దార్‌ను హెచ్చరించారు. ప్రకృతి ఒడిలో అల్పాహారం మానాల ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న ప్రకృతి ఒడిలో కలెక్టర్, జిల్లా, మండల స్థాయి అధికారులతో అల్ఫాహారం చేశారు. వెంటేశ్‌గౌడ్ అనే గీత కార్మికుడు తాటి ముంజలను కోసి ఇవ్వగా కలెక్టర్ వాటిని ఆరగించారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
పాన్‌గల్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని గ్రామాణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, కేతేపల్లి, గోపల్‌దిన్నె గ్రామాలల్లో నిర్వహించిన హరితహారంలో ఆయన పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి అవరణలు, పొలం గట్లు, కాల్వల పరిసరాలల్లో మొక్కలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. ఆయా గ్రామాలకు కేటాయించిన టార్గెట్లను పూర్తి చేయాలని దీంతో పాటు అధిక సంఖ్యలో మొక్కలు నాటి వాటిని కాపాడిన గ్రామాలకు అభివృద్ధి పనులకు నిధులతో పాటు తగిన పారితోషకం అందిస్తామన్నారు. నాటిన మొక్కలు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి కాపాడాలన్నారు.