scuba diver
-
వైరల్ వీడియో: వావ్.. సముద్రం అడుగున ఆక్టోపస్‌తో స్కూబా డైవర్ ఆటలు
-
వావ్.. సముద్రం అడుగున ఆక్టోపస్‌తో స్కూబా డైవర్ ఆటలు
ఎన్నో అద్భుతాలు, అందమైన జీవులకు నిలయం సముద్ర గర్భం. అక్కడ కన్పించే జలచరాలను చూస్తే ముచ్చటేస్తుంది. ఒక్కసారైనా వాటి దగ్గరకు వెళ్తే బాగుండనిపిస్తుంది. సాధారణ మనుషులకు ఇది కష్టమే అయినా స్కూబా డైవర్లు చాలా ఈజీ. వారు చాలా సార్లు సముద్రం అడుగుకు వెళ్తుంటారు. ఇప్పుడు అలాంటి స్కూబా డైవర్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సముద్ర గర్భంలో అతడు ఆక్టోపస్‌తో సరదాగా ఆడుకున్నాడు. అది కూడా అతనితో చనువుగా మెదిలింది. స్కూబ్ డైవర్ అరచేతి చూపగానే ఆక్టోపస్ అటువైపే దూసుకెళ్లింది. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత.. ఆక్టోపస్ అతని చేతిపైకి వెళ్లి సేదతీరింది. ఈ వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీనికి దాదాపు 30లక్షల వ్యూస్ వచ్చాయి. దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు. స్కూబా డైవర్‌కు ఆక్టోపస్ హగ్ ఇచ్చిందని, అతను చాలా లక్కీ అని చమత్కరించారు. చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్మెంట్లో తాగి విమానంలో రచ్చ రచ్చ.. -
కుమార్తెను చేరిన వందేళ్ల నాటి చెక్కుచెదరని ఉత్తరం
ఒక శతాబ్దం కిందట ఎవరో ఒక సందేశం పంపితే, మీకు అది ఇప్పుడు చేరితే ఎలా అనిపిస్తుంది. ఆశ్చర్యంగాను, ఆనందంగాను ఉంటుంది కదూ! ఆశ్చర్యంగా కాదు, వాస్తవంగానే జరిగింది. ఇది సినిమా కథ కాదు. అమెరికాలోని మిచిగాన్‌లో వెలుగుచూసిన వాస్తవ గాథ. ఈ ఆశ్చర్యంతో పాటు, ఆ సందేశం లభించిన ప్రదేశం గురించి తలచుకుంటే మరింత ఆశ్చర్యం వేస్తుంది. జెన్నిఫర్ డౌకర్ ఒక స్కూబా డైవర్. ఆవిడకు బోట్ టూర్ కంపెనీ ఉంది. ఆమె ఒక రోజు స్కూబా డైవింగ్ పూర్తి చేసుకుని, తన బోట్ అంచులు, కిటీకీలు శుభ్రపరుస్తుంటే, అక్కడ ఆకుపచ్చ రంగు సీసా కనిపించింది. అందులో మూడు వంతుల వరకు నీళ్లు ఉన్నాయి. చిన్న బిరడా మూత ఉంది. అయినా కూడా అందులో నుంచి కాగితం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సీసా తీసుకుని, మూత తీసి కాగితం చూసింది. ఆ కాగితం 1926లో రాసినది. అందులో ఒక సందేశంతో కూడిన ఉత్తరం ఉంది. ‘‘ఈ సీసా దొరికిన వారు ఇందులోని కాగితాన్ని జార్జ్ మారో చేబోగాన్‌కి అందచేయండి. అలాగే ఈ సీసా ఎక్కడ దొరికిందో కూడా తెలియచేయండి’’ అని రాసి ఉంది. నాటికల్ నార్త్ ఫ్యామిలీ అడ్వెంచర్స్ అనే సొంత టూర్ కంపెనీ అధినేత అయిన డౌకర్, తనకు దొరికిన సీసా, ఉత్తరాలకు ఫొటోలు తీసి, ఫేస్బుక్లో పోస్టు చేస్తూ ‘నాకు ఏం దొరికిందో ఒకసారి అందరూ చూడండి’ అన్నారు. ఆ మరుసటి రోజు ఈ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. డౌకర్ తన పోస్టు చూసుకునే సమయానికి ఒక లక్ష పదమూడు వేల మంది ఆ పోస్టును షేర్ చేశారు. చాలామంది ‘ఇది అద్భుతం, నమ్మశక్యంగా లేదు’ అంటూ కామెంట్స్ పెట్టారు. ‘ఈ సందేశం చూస్తే మాకు ఆనందంగా ఉంది’ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. టలియా రోథ్‌ఫ్లీష్ హాలీ, ‘ఇదొక అద్భుతం. ఆశ్చర్యం. ఇంతకాలం అక్షరాలు చెక్కుచెదరకుండా ఉండేలా ఏ ఇంక్ వాడారో తెలుసుకోవాలని ఉంది. అక్షరాలు చూస్తే ఈ రోజు రాసినట్లు ఉన్నాయి’ అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మారో పేరు మార్మోగుతోంది. ఈ సందేశం ఎవరు రాశారు అనే దాని కంటె, కథ సుఖాంతం అవుతుందా లేదా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉదాహరణకి, ‘‘ఈ సంఘటన భలే ఆసక్తిగా ఉంది. ఈ కథను కొనసాగించండి. ముగింపు ఎలా ఉంటుందో వినాలని ఆత్రంగా ఉంది’ అంటున్నారు పాట్రికా ఆడమ్స్. డౌకర్ ఆ ఉత్తరాన్ని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ‘స్కూబాకి ఎవరెవరు సంసిద్ధంగా ఉన్నారు?’ అనే సందేశం పెట్టారు. డౌకర్ సీసా మీద గుర్తుగా ఒక చుక్క పెట్టారు. ఈ సంఘటన జూన్ 18వ తేదీన జరిగింది. జూన్ 20, ఆదివారం నాడు స్కూబా డైవింగ్ చేసి, తన తండ్రి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా, డౌకర్‌కి ఒక ఫోన్ వచ్చింది. అది మిచెల్ ప్రిమ్యా అనే 74 సంవత్సరాల మహిళ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్. ఫేస్బుక్లో పోస్టు చూసిన ఒక మహిళ తనకు ఈ సమాచారం అందించిందని ఫోన్లో చెబుతూ, అది తన తండ్రి చేతి రాతని, తన తండ్రి 1995లో మరణించాడని వివరించారు. ఇక్కడ మరో ఆశ్చర్యమేమిటంటే, ఈ ఉత్తరాన్ని డౌకర్... ప్రిమ్యాకి అందచేద్దామనుకున్నారు. కాని ప్రిమ్యా ఆ ఉత్తరాన్ని డౌకర్ దగ్గరే ఉంచమన్నారు. ఆ ఉత్తరాన్ని ఒక షాడో బాక్స్‌లో ఫ్రేమ్ చేయించారు డౌకర్. ‘నా తండ్రి జ్ఞాపకాలు మరింత కాలం పదిలంగా ఉండాలి, అలాగే మరింతమంది ఈ ఉత్తరాన్ని చూడాలి’’ అంటున్నారు ప్రిమ్యా. ఇప్పుడు మీరు కూడా ఆ ఉత్తరం చూడాలనుకుంటున్నారా, అయితే వెంటనే బయలుదేరండి. డౌకర్ దగ్గరకు వెళితే, స్కూబా డైవింగ్ చేయిస్తూ, ఉత్తరం కూడా చూపిస్తారు. – వైజయంతి పురాణపండ -
రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి రావాలని ఎన్నడూ అనుకోలేదని ప్రధాని మోదీ వెల్లడించారు. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో ఒక భాగమై, దేశ ప్రజలకు సాధ్యమైనంత మేరకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సహనం, సంయమనం, పరిణతి చూపిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ప్రధాని ఆకాశవాణిలో మాసాంతపు ‘మన్ కీ బాత్’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ (నేషనల్ కేడెట్ కార్ప్స్) కేడెట్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ‘రాజకీయాల్లోకి ప్రవేశించాలని కానీ, రాజకీయాల గురించి కానీ ఎన్నడూ ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు రాజకీయ నేతగా మారా. దేశ సంక్షేమం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నా. దేశ సేవకే పూర్తిగా అంకితమైపోయా’అని ప్రధాని తెలిపారు. ‘చదవడం నాకు చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతా. అప్పుడప్పుడు సినిమాలు, చాలా తక్కువగా టీవీ చూస్తుంటా. కానీ, గూగుల్ ప్రభావం పుస్తక పఠనంపై పడింది. ఏ విషయం గురించి అయినా గూగుల్‌లో వెంటనే తెలుసుకోవచ్చు. అందుకే పుస్తకాలు చదవడం తగ్గిపోయింది’ అని అన్నారు. ‘పాఠశాల రోజుల్లో ఎన్సీసీ కేడెట్‌గా చాలా క్రమశిక్షణతో ఉండేవాడిని. అందుకే ఎన్నడూ శిక్షకు గురికాలేదు. ఓసారి చెట్టు కొమ్మపై గాలిపటం దారంలో ఇరుక్కున్న పావురాన్ని రక్షించేందుకు చెట్టెక్కా. పై అధికారి నన్ను శిక్షిస్తారని అక్కడున్న వారంతా అనుకున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు’అని చిన్ననాటి ఘటనను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. అయోధ్య తీర్పు అనంతర పరిస్థితులపై ప్రధాని మాట్లాడుతూ.. ‘జాతి ప్రయోజనాలకే పెద్దపీట అని 130 కోట్ల మంది దేశ ప్రజలు మరోసారి నిరూపించారు. ఆ తీర్పును విశాల హృదయంతో ఆహ్వానించారు. సహనం, సంయమనం, పరిణతి చూపిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ఐకమత్యం, శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. విశాఖ స్కూబా డైవర్లకు ప్రధాని ప్రత్యేక ప్రశంసలు పర్యావరణం, సుముద్ర జీవుల పరిరక్షణకు విశాఖకు చెందిన ‘ప్లాటిపస్ ఎస్కేప్’అనే సంస్థకు చెందిన స్కూబా డైవర్లు చేస్తున్న కృషిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ వీరిని మన్ కీ బాత్‌లో ప్రశంసిం చారు. వీరు తీరానికి 100 మీటర్ల దూరంలో సుముద్ర గర్భం లోపలికి వెళ్లి అక్కడ పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను తొలగిస్తున్నారని, రెండు వారాల్లో 4 వేల కేజీల ప్లాస్టిక్‌ను తొలగించినట్లు తనకు తెలిసిందని ప్రధాని వివరించారు. ఈ ప్రక్రియలో స్కూబా డైవర్లకు స్థానికులు సహకరిస్తున్నారని, వీరి చిరు ప్రయత్నం ఇప్పుడు ఉద్యమంగా మారుతోందన్నారు. -
చిర్రెత్తిన షార్క్ చుక్కలు చూపించింది
ఓ ఆస్ట్రేలియన్ డైవర్‌కు ఓ భారీ రాకాసి షార్క్ చుక్కలు చూపించింది. వేటాడివేటాడి తీవ్రంగా గాయపరిచింది. ఏదోలా చావు నుంచి బయటపడిన అతడు మాత్రం దాదాపు ఎనిమిదిగంటలపాటు చావుకంటే నరకాన్ని అనుభవించాడు. ఆ తర్వాతే అతడికి వైద్యం అందింది. క్వీన్స్లాండ్ తీరంలోని ఏజెన్సీ ప్రాంతంగా ఉండే గ్రేట్ బారియర్ రీఫ్లో స్కూబాకు చెందిన డైవర్ ఓ మరబోటులో వెళ్లి సముద్రంలోకి దిగాడు. అనంతరం ప్రశాంతంగా నీటి అడుగుభాగంలోకి వెళ్లి ఈదుతున్నాడు. దాదాపు 50 అడుగుల లోతుగా వెళ్లి ముందుకు వెళుతున్న సమయంలో అనూహ్యంగా వెనుక నుంచి అతడిపై షార్క్ దాడి చేసింది. అతడి చేతిని పలుమార్లుగట్టిగా కొరికింది. అలాగే కడుపులో కూడా గాయం చేసింది. వైద్య పరిభాషలో చెప్పాలంటే తీవ్ర ఆగ్రహావేశంతో అనుకొని మరి ఈ దాడిని షార్క్ చేసింది. దాదాపు ఎనిమిది చోట్ల గాయాలపాలయినప్పటికీ ఎంతో ధైర్యంగా ఈది తన మరబోటును చేరుకున్న అతడు బతుకు జీవుడా అని బోటులో పడ్డాడు. రక్తస్రావం తీవ్రంగా అవడంతోపాటు భారీ గాయాలతో దాదాపు 8గంటలపాటు నొప్పులు అనుభవించాడు. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు.