పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తి!
గుంటూరు: సిమి ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు వెళ్తుతున్నారని వచ్చిన సమాచారంతో గురువారం తెల్లవారుజామున తెనాలి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
అతని వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో రూ. 50 వేల నగదు, రోడ్ అట్లాస్ ఉన్నాయి. తన పేరు మునీర్ అహ్మద్ అని, తమిళనాడు కలక్కడ్ తమ స్వగ్రామమని అతను పోలీసులకు తెలిపాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న జీఆర్పీ పోలీసులు అతని నుంచి అదనపు సమాచారం సేకరిస్తున్నారు.