పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తి! | one taken in to police custody after held a search opration in railway station | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తి!

Published Thu, Apr 9 2015 6:21 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తి! - Sakshi

పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తి!

గుంటూరు: సిమి ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులు వెళ్తుతున్నారని వచ్చిన సమాచారంతో గురువారం తెల్లవారుజామున తెనాలి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

అతని వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో రూ. 50 వేల నగదు, రోడ్ అట్లాస్ ఉన్నాయి. తన పేరు మునీర్‌ అహ్మద్ అని, తమిళనాడు కలక్కడ్ తమ స్వగ్రామమని అతను పోలీసులకు తెలిపాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న జీఆర్పీ పోలీసులు అతని నుంచి అదనపు సమాచారం సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement