కోట అందాలు భేష్..!
ఓరుగల్లు కోటలో పర్యటించిన గవర్నర్ న రసింహన్
రాతికోట, ఖుషీమహల్, ఏకశిల గుట్ట సందర్శన
కాకతీయ శిల్ప సంపదకు తన్మయులైన గవర్నర్ దంపతులు
ఖిలా వరంగల్/హన్మకొండ కల్చరల్: చరిత్రాత్మక ఓరుగల్లు కోటలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా పర్యటించారు. గవర్నర్ దంపతులను వరంగల్ తహసీల్దార్ రవి, పర్యాటకశాఖ జిల్లా అధికారి శివాజీ, సాదరంగా అహ్వనించారు. తొలుత రాతి చుట్టు పర్యటిం చిన గవర్నర్ కోట తాలుకు వివరాలను తెలుసుకున్నారు. ఆపై నేరుగా ఖుషిమహాల్ని సందర్శించి ఆక్కడి శిల్ప సంపదను, కాకతీయుల నిర్మాణ కౌశల్యాన్ని తిలకించారు. ఆతర్వత కాకతీయుల కీర్తితోరణాలు నడమ ఉన్న శిల్పాల సం పద ప్రాంగణాన్ని సందర్శించారు. ఆక్కడ ఉన్న శిల్పాలను, నళ్లరాతితో కాకతీయ శిల్పలు చెక్కిన ఆరుదైన కళా సంపదను చూసి ముగ్దులయ్యారు. తర్వాత గుండు చెరువును సందర్శించి పక్కనే ఉన్న ఏకశిల గుట్టఎక్కి వరంగల్ కోట అందాలతోపాటు నగరాన్ని వీక్షించారు.
ఆలయంలో పూజలు..
హన్మకొండలోని రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయాన్ని గవర్నర్ దంపతులు సందర్శించారు. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ తాళ్లూరి రమేశ్‌బాబు, అసిస్టెంట్ కమిషనర్ సాయిబాబా, అర్చకులు, పండితులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మూలమహాగణపతికి, రుద్రేశ్వరునికి పూజలు చేశారు. అనంతరం గంగు ఉపేంద్రశర్మ వారికి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి పట్టుధోవతి, పట్టుచీర అందజేశారు. బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్శర్మ గవర్నర్ దంపతులను సత్కరించారు. తరువాత గంగు ఉపేంద్రశర్మ వారికి దేవాలయాల స్తంభాల్లో దారం దూరేంత సన్నని రంధ్రాలను శి ల్పులు చెక్కిన విషయాన్ని చూపించారు. కాగా గవర్నర్ దంపతులు ఆలయంలోని నందీశ్వరున్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ సలహాదారు పాపారావు(రిటైర్డ్ ఐఏఎస్) గవర్నర్‌కు వాటి విశేషాలను వివరించారు. గవర్నర్ వెంట కలెక్టర్ వాకాటి కరుణ, జిల్లా ఎస్పీ అంబర్కిశోర్ఝూ, జి ల్లా టూరిజంశాఖ అధికారి శివాజి, జిల్లా పౌర సంబంధాల శాఖ డీడీ బాలగంగాధరతిలక్, జేసీ ప్రశాంత్‌పాటిల్, నగర కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.