అమృతా ఏజెన్సీకి ‘సీతారామ’ ప్యాకేజీ 3 పనులు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే సీతారామ ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-3 పనులను 0.5% లెస్తో అమృతా కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. ఈమేరకు ప్యాకేజీ-3 పనుల ప్రైస్‌బిడ్‌ను అధికారులు శుక్రవారం తెరిచారు. దుమ్ముగూడెం నుంచి 39వ కిలోమీటర్ కెనాల్ వరకు సీతారామ ప్రాజెక్టు పనులకు ఆగస్టు నెలలో టెండర్లు పిలిచారు. మొదటి ప్యాకేజీ పనులకు రూ.1,455 కోట్లతో టెండర్ పిలవగా వీటిని మెగా కంపెనీ దక్కించుకుంది. రెండో ప్యాకేజీలో రూ.317కోట్ల పనులను 1.1లెస్తో బీవీఎస్ఆర్ సంస్థ దక్కించుకుంది. వేపులగడ్డ నుంచి కోయగుట్ట (39.9వ కిలోమీటర్) వరకు రూ.254 కోట్లతో టెండర్ పిలిచిన మూడో ప్యాకేజీ పనులకుమొత్తంగా 8 సంస్థలు పోటీపడగా.. ఇందులో 0.5లెస్‌కు టెండర్ వేసిన అమృతా ఏజెన్సీ సంస్థకు పనులు దక్కాయి.