ఫేస్ బుక్ లో అమ్మకానికి అమ్మతనం
అట్లాంటా: 'ఆరు నెలల గర్భవతిని. తెల్లని పండంటి బిడ్డ గ్యారెంటీ. కావాల్సిన వారు డబ్బులిచ్చి లేదా డ్రగ్స్ ఇచ్చి కొనుక్కోవచ్చు' అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటాలో ఓ అమ్మ క్రెయిగ్లిస్ట్ అట్లాంటా ఫేస్బుక్ పేజీలో (May 22) ఇచ్చిన ప్రకటన ఇది. ఇలా డబ్బు, డ్రగ్స్ కోసం పుట్టబోయే బిడ్డను అమ్మకానికి పెట్టిన ఈ అమ్మపై వందలాది నెటిజన్లు మండిపడుతూ అధికారులకు ఫిర్యాదులు చేశారు.
దీంతో జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు ఈ యాడ్‌కు సంబంధించి సుమారు 100 ఫోన్‌కాల్స్ అందుకున్నారు. ఇది ఆకతాయి అమ్మ పనా? లేక నిజమా? అనేది తేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.