ఫేస్ బుక్ లో అమ్మకానికి అమ్మతనం | Authorities investigating Atlanta Craigslist ad to sell unborn baby for drugs | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ లో అమ్మకానికి అమ్మతనం

Published Fri, Jun 5 2015 9:35 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్ బుక్ లో అమ్మకానికి అమ్మతనం - Sakshi

ఫేస్ బుక్ లో అమ్మకానికి అమ్మతనం

అట్లాంటా: 'ఆరు నెలల గర్భవతిని. తెల్లని పండంటి బిడ్డ గ్యారెంటీ. కావాల్సిన వారు డబ్బులిచ్చి లేదా డ్రగ్స్ ఇచ్చి కొనుక్కోవచ్చు'  అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటాలో ఓ అమ్మ క్రెయిగ్లిస్ట్ అట్లాంటా ఫేస్బుక్ పేజీలో (May 22)  ఇచ్చిన ప్రకటన ఇది. ఇలా డబ్బు, డ్రగ్స్ కోసం పుట్టబోయే బిడ్డను అమ్మకానికి పెట్టిన ఈ అమ్మపై వందలాది నెటిజన్లు మండిపడుతూ అధికారులకు ఫిర్యాదులు చేశారు.

 

దీంతో జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు.  అధికారులు ఈ యాడ్కు సంబంధించి సుమారు 100 ఫోన్కాల్స్ అందుకున్నారు. ఇది ఆకతాయి అమ్మ పనా? లేక నిజమా? అనేది తేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement