Selvan
-
'లవ్‌స్టోరి'ని తలపిస్తున్న తమిళనాడు జంట కథ
చెన్నై: తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన సెల్వన్(29) అనే యువకుడు, ఇళమతి(23) అనే యువతి ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకే కంపెనీ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరువురి కుటుంబాలు వీరి ప్రేమను వ్యతిరేకించాయి. దాంతో కన్నవాళ్లను కాదనుకుని ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కొన్ని నెలలు పాటు సంతోషంగా జీవించారు. అయితే వీళ్లు ఎక్కడ కాపురం పెట్టారో తెలుసుకున్న యువతి కుటుంబం ఆ యువకుడిని కొట్టి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనతో తీవ్ర మనోవేదన చెందిన సెల్వన్ తన భార్యను తీసుకెళ్లిపోయారని తాము మేజర్లమని.. ప్రేమ పెళ్లి చేసుకున్నామని పోలీసులకు తెలిపాడు. అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రికి ఇళమతి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని సెల్వన్ ఆరోపించాడు. తన భార్య ఇళమతి నుంచి ఇటీవల సెల్వన్‌కు వాట్సాప్‌లో.. తనను చంపాలని చూస్తున్నారని కాపాడాలంటూ మెసేజ్ చేసింది. దాంతో ఆ యువకుడు మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని వివరించాడు. తన భార్యకు ప్రాణహాని ఉందని ఆ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని విచారణ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. -
కోర్టులో లొంగిపోయిన ఫాదర్
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి అదృశ్యమై కోర్టులో లొంగిపోయిన ఫాదర్‌ను రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదే శించారు. నెల్లై జిల్లా పులియాంపట్టి సమీపంలోని కైలాసపురానికి చెందిన సెల్వన్ (34) నెల్లై పేటలోని ఆంతోనియా చర్చికి ఫాదర్‌గా ఉన్నారు. అక్కడ మహోన్నత పాఠశాలలో ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థిని చర్చికి వచ్చిన సమయంలో ఆమెకు పాటలు నేర్పుటకు తన బంగ్లాకు తీసుకెళ్లారు. ఆ సమయంలో విద్యార్థినిపై అత్యాచారం చేయడంతో విద్యార్థిని గర్భిణీ అయ్యింది. ఈ వ్యవహారం తెలియకుండా ఉండేందుకు విద్యార్థినిని నెల్లై టౌన్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. విద్యార్థిని గర్భంలో ఉన్న ఐదు నెలల శిశువును పేటై ఆదంనగర్ సమీపంలో వున్న అడవిలో పాతి పెట్టారు. దీనికి సంబంధించి ఫిర్యాదు అందుకున్న నెల్లై మహిళా పోలీసులు ఫాదర్, అబార్షన్ చేసిన డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అదృశ్యమైన ఫాదర్ సెల్వన్ ఉత్తమ పాళయం న్యాయస్థానంలో శుక్రవారం సాయంత్రం లొంగిపోయూరు. ఆయనను రిమాండ్‌లో ఉంచి ఈ నెల 26వ తేదీన కోర్టులో హాజరు పరచాలని న్యాయమూర్తి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఫాదర్‌ను మదురై జైలుకు తరలించారు. 26న కోర్టులో హాజరు పరచనున్నారు.