కోర్టులో లొంగిపోయిన ఫాదర్
Published Sun, Dec 22 2013 1:50 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి అదృశ్యమై కోర్టులో లొంగిపోయిన ఫాదర్‌ను రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదే శించారు. నెల్లై జిల్లా పులియాంపట్టి సమీపంలోని కైలాసపురానికి చెందిన సెల్వన్ (34) నెల్లై పేటలోని ఆంతోనియా చర్చికి ఫాదర్‌గా ఉన్నారు. అక్కడ మహోన్నత పాఠశాలలో ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థిని చర్చికి వచ్చిన సమయంలో ఆమెకు పాటలు నేర్పుటకు తన బంగ్లాకు తీసుకెళ్లారు. ఆ సమయంలో విద్యార్థినిపై అత్యాచారం చేయడంతో విద్యార్థిని గర్భిణీ అయ్యింది.
ఈ వ్యవహారం తెలియకుండా ఉండేందుకు విద్యార్థినిని నెల్లై టౌన్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. విద్యార్థిని గర్భంలో ఉన్న ఐదు నెలల శిశువును పేటై ఆదంనగర్ సమీపంలో వున్న అడవిలో పాతి పెట్టారు. దీనికి సంబంధించి ఫిర్యాదు అందుకున్న నెల్లై మహిళా పోలీసులు ఫాదర్, అబార్షన్ చేసిన డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అదృశ్యమైన ఫాదర్ సెల్వన్ ఉత్తమ పాళయం న్యాయస్థానంలో శుక్రవారం సాయంత్రం లొంగిపోయూరు. ఆయనను రిమాండ్‌లో ఉంచి ఈ నెల 26వ తేదీన కోర్టులో హాజరు పరచాలని న్యాయమూర్తి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఫాదర్‌ను మదురై జైలుకు తరలించారు. 26న కోర్టులో హాజరు పరచనున్నారు.
Advertisement
Advertisement