Senegal Women
-
పార్లమెంట్ వేదికగా మహిళా ఎంపీపై దాడి.. వీడియో వైరల్
డాకర్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య సంఘటన జరిగింది. ఓ మహిళా చట్ట సభ్యురాలిపై మరో ఎంపీ చేయి చేసుకున్నాడు. ఇష్టారీతిన దాడి చేశాడు. ఈ సంఘటన ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అధికార కూటమి బెన్నో బాక్ యకార్(బీబీవై)కి చెందిన మహిళా చట్టసభ్యురాలు అమి డైయే గ్నిబీపై.. ప్రతిపక్ష ఎంపీ మస్సాటా సాంబ్ చేయి చేసుకున్నాడు. దాడి చేసిన క్రమంలో పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పక్షాల ఎంపీలు కుర్చీలు, పేపర్లు విసురుకున్నారు. తనపై దాడి చేసిన సాంబ్పై కుర్చీ విసిరి పడిపోయారు గ్నిబీ. ఇరువురిని వేరు చేసేందుకు మరికొంత మంది ఎంపీలు ప్రయత్నించారు. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైన క్రమంలో సమావేశాలను వాయిదా వేశారు. అధ్యక్షుడు మాకి సాల్ మూడోసారి ఎన్నికను గ్నీబి వ్యతిరేకించారు. మరోవైపు.. సాంబ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన క్రమంలో ఆయన ఆమె వద్దకు వచ్చి దాడి చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాది జులైలో జరిగిన ఎన్నికల్లో అధికార కూటమికి మెజారిటీ రాకపోవటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. ❗*Chaos in Senegal Parliament after MP Slaps Female Colleague* The brawl began when opposition member Massata Samb walked over and slapped Amy Ndiaye Gniby - an MP of the ruling coalition - during a budget presentation, TV footage showed. pic.twitter.com/9Y074xSVTS — Daniel Marven (@danielmarven) December 2, 2022 ఇదీ చదవండి: మస్క్లో ప్రవహించే రక్తం సగం చైనాదే!.. ఎలన్ మస్క్ పుట్టుకపై తీవ్ర వ్యాఖ్యలు -
కోడింగ్ తో హద్దులను అధిగమించింది..!
పశ్చిమాఫ్రికాకు చెందిన యౌమా.. తన చిన్ననాటి కలను కోడింగ్ తో సాకారం చేసుకుంది. సెనెగల్ లో మహిళల పట్ల చూపించే వివక్ష, వారికి విధించే హద్దులను అధిగమించింది. పెన్నులు, పెన్సిళ్ళు సైతం కొనుగోలు చేయలేని అనేకమంది విద్యార్థులకు పుస్తకాల అవసరమే లేకుండా కొత్త మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టింది. తన ఆలోచనను అమల్లోకి తెచ్చిన యౌమా.. స్థానిక వొలాఫ్ భాషలో మొబైల్ ఫోన్ అప్లికేషన్ 'వెక్కియో'.. ను రూపొందించింది. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు పుస్తకాల కష్టం నుంచీ మార్పును తెస్తోంది. ప్రత్యేక కార్యక్రమం ద్వారా సెనెగల్ లోని యువతులను కోడింగ్, టెక్నాలజీల్లో ప్రోత్సాహాన్ని కూడా అందిస్తోంది. తాను రూపొందించిన కొత్త యాప్ విద్యార్థులకు పుస్తకాల కష్టాన్ని దూరం చేస్తుందని ఆశిస్తున్నట్లు సెనెగల్ కు చెందిన 24 ఏళ్ళ డిజైనింగ్ ఇంజనీర్ యౌమా ఫాల్ చెప్తోంది. సంస్కృతీ సంప్రదాయాలు, లింగ వివక్ష అధికంగా కనిపించే ముస్లిం కమ్యూనిటీ విరాజిల్లుతున్నపశ్చిమ ఆఫ్రికా దేశంలో యౌమాతోపాటు కొందరు యువతులు తమ నైపుణ్యాన్ని వినియోగించి.. సరిహద్దులను చెరిపేస్తున్నారు. సెనెగల్ లో ఆన్ లైన్ జీవితానికి మొబైల్ ఫోన్లు కేంద్ర బిందువులు. అక్కడ దాదాపు 95 శాతం ఇంటర్నెట్ కనెక్షన్లు మొబైల్ ఫోన్లద్వారానే వినియోగిస్తున్నట్లు సెనెగల్ పోస్ట్స్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ రెగ్యులేషన్ అథారిటీ లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే అక్కడి యువతుల్లో 30 శాతం కంటే తక్కువమంది యువతులు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటున్నట్లు నిపుణుల ద్వారా తెలుస్తోంది. ఈ పరిస్థితిని అధిగమిస్తూ సాంకేతిక, కోడింగ్ లలో యువతులను ప్రోత్సహిస్తూ ఫాల్.. కొత్త ఒరవడిని సృష్టించింది.