బంజారాహిల్స్ లో భారీ చోరీ
హైదరాబాద్: బంజారాహిల్స్ సినారీ వ్యాలీలో భారీ చోరి జరిగింది. వ్యాలీలో నివసించే శ్యామ్ సుందర్ అనే రియల్టర్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. దుండగులు కోటిన్నర విలువైన బంగారం, డబ్బు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఈ ఘటనపై శ్యామ్ సుందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.