SensexNifty
-
గణాంకాల జోష్‌తో...
వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ అప్ - 161 లాభంతో 26,587 పాయింట్లకు సెన్సెక్స్ - 30 పాయింట్ల లాభంతో.. 8,014కు నిఫ్టీ ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండడం, మేలో ద్రవ్యోల్బణం నిలకడగా ఉండటంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. వాహన, ఆరోగ్య సంరక్షణ షేర్ల దన్నుతో బీఎస్ఈ సెన్సెక్స్ 161 పాయింట్ల లాభంతో 26,587 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 8.014 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇటీవల బాగా క్షీణించిన షేర్లలో కొనుగోళ్లు జరగడం, ఇప్పటిదాకా కురిసిన వర్షాల సగటు సాధారణ పరిమితి కంటే 5 శాతం అధికమని వాతావారణ విభాగం వెల్లడించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. గ్రీస్ రుణ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా శుక్రవారానికి కొనసాగింపుగా మన స్టాక్ మార్కెట్ మాత్రం లాభాలు పంచింది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, వాహన షేర్లతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకుల, ఆర్థిక సేవల కంపెనీలు షేర్లు పెరిగాయి. రిలీఫ్ ర్యాలీ: ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల కారణంగా స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుందని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. దక్షిణాదిన సకాలంలో వచ్చిన రుతుపవనాలు స్టాక్ మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయన్నారు. లాభ నష్టాల్లో... 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,353 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.11,654 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ. 2,12,556 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.605 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.650 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. 1,440 షేర్లు లాభాల్లో, 1,207 షేర్లు నష్టాల్లో ముగిశాయి. -
27,000 దాటితేనే సెన్సెక్స్‌కు స్థిరత్వం
దేశంలో పారిశ్రామికోత్పత్తి అంచనాలకంటే మించిందని, ద్రవ్యోల్బణం భయపడినంతగా పెరగలేదంటూ రెండు సానుకూల వార్తలు గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి. అలాగే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన తర్వాత, ఇప్పటివరకూ సగటుకంటే 5 శాతం ఎక్కువగా వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. జూన్2 నాటి పాలసీ సమీక్షలో రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించినా, వర్షాభావం, ద్రవ్యోల్బణం పట్ల ఆందోళనతోనే స్టాక్ మార్కెట్ 5 శాతంపైగా పడిపోయింది. ఈ భయాలు ప్రస్తుతానికి తొలగిపోయినందున, మార్కెట్ ఓవర్‌సోల్డ్ కండీషన్లో వున్నందున, ఈ వారం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీకి ఛాన్స్ వుంది. కానీ గ్రీసు-యూరోపియన్ యూనియన్ దేశాలు-ఐఎంఎఫ్‌ల మధ్య ఒక అంగీకారం కుదరక గత శుక్రవారం పశ్చిమ దేశాల మార్కెట్లు పడిపోయాయి. వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి కీలకమైన ఫెడ్ ప్రకటన ఈ బుధవారం వెలువడుతుందన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. ఈ కారణాలతో మార్కెట్ మరింత క్షీణించే ప్రమాదం కూడా వుంది. సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జూన్ 12తో ముగిసిన వారంలో 27,000-26,307 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 343 పాయింట్ల నష్టంతో 26,425వద్ద ముగిసింది. ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 26,250 వద్ద తక్షణ మద్దతు లభ్యమవుతున్నది. ఈ స్థాయి దిగువన ముగిస్తే 26,090 వద్దకు క్షీణించవచ్చు. ఆ లోపున కీలకమైన మద్దతు 25,900 స్థాయి. పెద్ద ప్రతికూల వార్త వెలువడితే తప్ప ఈ స్థాయిని సెన్సెక్స్ కోల్పోయే అవకాశాలు తక్కువ. ఈ స్థాయి దిగువన 25,200 వరకూ నిలువునా పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ వారం గ్యాప్‌అప్‌తో మొదలైతే 26,470 పాయింట్ల స్థాయికి సూచీ చేరవచ్చు. ఆపైన ముగిస్తే 26,770 స్థాయిని అందుకునే వీలుంటుంది. రానున్న రోజుల్లో సెన్సెక్స్‌కు స్థిరత్వం రావాలంటే 27,000 పాయింట్లపైన కొద్దిరోజులపాటు ట్రేడ్కావాల్సివుంటుంది. నిఫ్టీ తక్షణ మద్దతు 7,920-నిరోధం 8,030 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,160-7,940 మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు 132 పాయింట్ల నష్టంతో 7,983 వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే 8,030 స్థాయి నిఫ్టీకి స్వల్ప నిరోధాన్ని కల్పించవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. అటు తర్వాత 8,100 స్థాయిని చేరొచ్చు. అటుపైన 8,150-8,190 కీలకమైన అవరోధ శ్రేణి. తదుపరి వారాల్లో 8,460 స్థాయిని అందుకోవాలంటే ఈ అవరోధ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించాల్సివుంటుందని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 7,920 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 200 పాయిం ట్ల వరకూ పలు స్థాయిల వద్ద సాంకేతిక మద్దతులు నిఫ్టీకి వున్నందున, రానున్న రోజుల్లో మార్కెట్లను అతలాకుతలం చేసే ప్రతికూల వార్త ఏదైనా వెలువడితే తప్ప, 7,720 స్థాయిలోపునకు నిఫ్టీ తగ్గకపోవొచ్చు. 7,920 స్థాయిని ముగింపులో కోల్పోతే 7,850 వరకూ నిఫ్టీ క్షీణించవచ్చు. -
8,000 దిగువకు నిఫ్టీ
వర్షాభావ భయాలతో మార్కెట్ కుదేల్ ♦ 470 పాయింట్ల నష్టంతో 26,371కు సెన్సెక్స్ ♦ నిఫ్టీకి 159 మైనస్... సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురుస్తాయన్న ఆందోళనలు గురువారం స్టాక్‌మార్కెట్‌పై పిడుగులు కురిపించాయి. దీనికి తోడు రుణ వృద్ధి మందగమనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 470 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 8,000 పాయింట్ల దిగువకు వచ్చేసింది. కరంట్ అకౌంట్ లోటు తగ్గడం, సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు. వీటిని వేటినీ ఇన్వెస్టర్లు పట్టించుకోలేదు.శుక్రవారం విడుదల కానున్న ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి, మే నెల వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టిపెట్టిన ట్రేడర్లు తమ పొజిషన్లను తగ్గించుకుంటున్నారని విశ్లేషకులంటున్నారు. మొత్తం మీద సెన్సెక్స్ 470 పాయింట్లు నష్టపోయి 26,371 పాయింట్ల వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి 7,965 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు గత ఏడాది అక్టోబర్ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. బ్యాంక్, ఆర్థిక సేవలు, వాహన, విద్యుత్ రంగ కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలపాలయ్యాయి. బ్యాంక్ షేర్లు బేర్ ... ప్రభుత్వ రంగ బ్యాంకులకు బడ్జెట్లో కేటాయించినదాని కంటే మరిన్ని పెట్టుబడులు కావాలంటూ ఆర్బీఐ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాయడంతో బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. ఆర్థికమంత్రి జైట్లీ శుక్రవారం పీఎస్ బ్యాంకు చీఫ్‌లతో భేటీ కానున్నారు. 30 సెన్సెక్స్ షేర్లలో 29కి నష్టాలే: వేదాంతా మినహా 30 సెన్సెక్స్ షేర్లలో 29 షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,508 కోట్లు. ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,406 కోట్లు. డెరివేటివ్స్ విభాగంలో రూ.2,80,050 కోట్లుగా నమోదైంది. నిఫ్టీ టార్గెట్‌ను సవరించిన యూబీఎస్ ఈ ఏడాది చివరికల్లా నిఫ్టీ టార్గెట్‌ను స్విట్జర్లాండ్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సవరించింది. ఈ టార్గెట్‌ను గత 9,200 నుంచి వర్షాభావ అంచనాల వల్ల ప్రస్తుతం 8,600కు తగ్గిస్తున్నామని తెలిపింది. మూడు నెలల్లో 12 శాతం పతనం సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత 27,000 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. లాభాల స్వీకరణ కారణంగా 26,349 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 470 పాయింట్లు(1.75 శాతం) నష్టంతో 26,371 పాయింట్ల వద్ద ముగిసింది. 7,958-8,163 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడిన నిఫ్టీ చివరకు 159 పాయింట్ల (1.96 శాతం)నష్టంతో 7,965 పాయింట్ల వద్ద ముగి సింది. ఈ ఏడాది మార్చి 4న సెన్సెక్స్ 30,025, నిఫ్టీ 9,119 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అప్పటి నుంచి చూస్తే కేవలం మూడు నెలల్లో సెన్సెక్స్ 12.2 శాతం, నిఫ్టీ 12.7 శాతం చొప్పున పతనమయ్యాయి.