Series badminton tournament
-
సింగిల్స్ రన్నరప్ వృశాలి
సాక్షి, హైదరాబాద్: పోలిష్ ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి గుమ్మడి వృశాలి రన్నరప్‌గా నిలిచింది. పోలాండ్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో వృశాలి 11–21, 14–21తో భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్స్‌లో వృశాలి 23–21, 21–9తో ప్రిస్కిలా(జర్మనీ)పై, రితూపర్ణ 21–19, 21–11తో జోర్డాన్ హార్ట్ (వేల్స్)పై గెలుపొందారు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ హర్షీల్ డాని విజేతగా నిలిచాడు. ఫైనల్లో హర్షీల్ 21–19, 21–13తో నాలుగో సీడ్ లూ చియా హంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్ పరాజయం
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. ప్రపంచ 15వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-18, 14-21, 19-21తో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడినా కీలకదశలో జ్విబ్లెర్ పైచేయి సాధించాడు. తొలి గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్ 12-16తో వెనుకబడినా వెంటనే తేరుకొని వరుసగా ఎనిమిది పాయింట్లు స్కోరు చేశాడు. ఆ తర్వాత జ్విబ్లెర్కు రెండు పాయింట్లు కోల్పోయి, తాను ఒక పాయింట్ సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో జ్విబ్లెర్ 9-7తో ఆధిక్యం సంపాదించి ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 16-13తో ముందంజ వేసి విజయందిశగా సాగుతున్నట్లు కనిపించాడు. కానీ ఈ దశలో శ్రీకాంత్ వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయి 16-19తో వెనుకబడి కోలుకోలేకపోయాడు.