క్వార్టర్స్‌లో శ్రీకాంత్ పరాజయం | Japan Super Series badminton tournament: Indian campaign ends as Srikanth loses | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శ్రీకాంత్ పరాజయం

Sep 24 2016 1:43 AM | Updated on Sep 4 2017 2:40 PM

క్వార్టర్స్‌లో శ్రీకాంత్ పరాజయం

క్వార్టర్స్‌లో శ్రీకాంత్ పరాజయం

జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన భారత

 టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. ప్రపంచ 15వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-18, 14-21, 19-21తో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడినా కీలకదశలో జ్విబ్లెర్ పైచేయి సాధించాడు.
 
 తొలి గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్ 12-16తో వెనుకబడినా వెంటనే తేరుకొని వరుసగా ఎనిమిది పాయింట్లు స్కోరు చేశాడు. ఆ తర్వాత జ్విబ్లెర్‌కు రెండు పాయింట్లు కోల్పోయి, తాను ఒక పాయింట్ సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో జ్విబ్లెర్ 9-7తో ఆధిక్యం సంపాదించి ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గేమ్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 16-13తో ముందంజ వేసి విజయందిశగా సాగుతున్నట్లు కనిపించాడు. కానీ ఈ దశలో శ్రీకాంత్ వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయి 16-19తో వెనుకబడి కోలుకోలేకపోయాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement