sethupathi
-
400 ఏళ్ల నాటి పురాతన రాజ వంశ విగ్రహం కోసం...దొంగలకే టోపీ పెట్టి
చెన్నై: తమిళనాడులోని పురాతన విగ్రహాలను కనిపెట్టే వింగ్(ఐడల్ వింగ్)కి సేతుపతి వంశానికి చెందిన 400 ఏళ్ల నాటి పురాతన విగ్రహం గురించి సమాచారం అందింది. ఈ మేరకు ఐడల్ వింగ్ బృందం అండర్ కవర్ అపరేషన్ చేపట్టి ఆ విగ్రహాన్ని కనిపెట్టారు. ఈ మేరకు అధికారులు తుత్తకుడి నివాసితులైన ఆరుముగరాజ్, కుమార్వేల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పురాతన విగ్రహాన్ని విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు తమ సిబ్బందిలోని కొంతమంది ధనవంతులైన వ్యక్తులుగా వారిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. ఈ విధంగా ధనవంతులైన వ్యక్తులుగా ఆ విగ్రహానికి కొనుగోలు చేసే నెపంతో వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని వ్యూహం పన్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ముస్తఫ్ అనే వ్యక్తి పురాతన విగ్రహాన్ని తిరుచ్చి - మదురై హైవేపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఐతే పోలీసులు ఆ విగ్రహాన్ని చూడటానికి కోట్లలలో తమ వద్ద డబ్బు ఉందని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఆ స్మగ్లర్లతో బేరసారాలు ఆడుతూ అసలు గుట్టంతా తెలసుకుని ముస్తఫా, ఆరుముగరాజ్, కుమారవేల్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ నిందితులను విచారించగా తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి నుంచి ఈ విగ్రహాన్ని పొందినట్లు తెలిపాడు. ఐతే సెల్వకుమార్ వద్దే ఈ విగ్రహం 12 ఏళ్లుగా ఉందని, దీన్ని తన తండ్రి నాగరాజన్ ఇచ్చాడని చెప్పాడు. ఈ విగ్రహం సేతుపతి వంశానికి చెందిన పురాతన మహిళ విగ్రహం. ఆ విగ్రహం ఖరీదు వేల కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు . (చదవండి: కస్టమర్‌కి చేదు అనుభవం... అలా వచ్చాడని టికెట్టు ఇవ్వనన్న మల్టీప్లెక్స్ థియేటర్) -
రీమేక్‌తో ఎంట్రీ ఇస్తున్న రవితేజ
సినీ ప్రముఖుల వారసులు మాత్రమేకాదు.. రాజకీయనాయకుల వారసులు కూడా వెండితెరపై మెరిసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది రాజకీయనాయకుల వారసులు సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అదే బాటలో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు రవితేజ. ఏపి మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే తొలి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న రవితేజ, రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. తమిళ్ లో ఘనవిజయం సాధించిన సేతుపతి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు రీమేక్ స్పెషలిస్ట్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోంది. -
మరో తమిళ్ రీమేక్‌లో వెంకీ
కొంత కాలంగా స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అయిన సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పుడు రూట్ మార్చాడు. వరుస సినిమాలకు కమిట్ అవుతూ యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు. అయితే పెద్దగా రిస్క్ చేయటం ఇష్టం లేని ఈ సీనియర్ హీరో ఎక్కువగా రీమేక్ సినిమాల మీదే దృష్టిపెడుతున్నాడు. ఇప్పటికే ఓ రీమేక్‌కు ఓకే చెప్పేసిన వెంకీ ఇప్పుడు మరో రీమేక్‌పై కూడా దృష్టి పెట్టాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్న వెంకటేష్, ఆ సినిమా తరువాత బాలీవుడ్లో మంచి విజయం సాధించిన 'సాలా ఖద్దూస్' సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమా తరువాత క్రాంతి మాధవ్ డైరెక్షన్లో సినిమాకు అంగీకరించిన వెంకీ, ఆ సినిమాతో పాటు మరో రీమేక్‌కు కూడా రెడీ అవుతున్నాడు. ఇటీవల తమిళ్లో రిలీజ్ అయిన సేతుపతి సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించే అవకాశం ఉంది.