మరో తమిళ్ రీమేక్లో వెంకీ | venkatesh in tamil movie sethupathi remake | Sakshi
Sakshi News home page

మరో తమిళ్ రీమేక్లో వెంకీ

Published Sat, Mar 5 2016 8:44 AM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

మరో తమిళ్ రీమేక్లో వెంకీ

మరో తమిళ్ రీమేక్లో వెంకీ

కొంత కాలంగా స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అయిన సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పుడు రూట్ మార్చాడు. వరుస సినిమాలకు కమిట్ అవుతూ యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు. అయితే పెద్దగా రిస్క్ చేయటం ఇష్టం లేని ఈ సీనియర్ హీరో ఎక్కువగా రీమేక్ సినిమాల మీదే దృష్టిపెడుతున్నాడు. ఇప్పటికే ఓ రీమేక్కు ఓకే చెప్పేసిన వెంకీ ఇప్పుడు మరో రీమేక్పై కూడా దృష్టి పెట్టాడు.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్న వెంకటేష్, ఆ సినిమా తరువాత బాలీవుడ్లో మంచి విజయం సాధించిన 'సాలా ఖద్దూస్' సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమా తరువాత క్రాంతి మాధవ్ డైరెక్షన్లో సినిమాకు అంగీకరించిన వెంకీ, ఆ సినిమాతో పాటు మరో రీమేక్కు కూడా రెడీ అవుతున్నాడు. ఇటీవల తమిళ్లో రిలీజ్ అయిన సేతుపతి సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement