seven companies
-
7 బిజినెస్ గ్రూప్‌ల ఆస్తుల వేలం: సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏడు బిజినెస్ గ్రూప్‌లకు చెందిన 17 ఆస్తులను వేలం వేయనున్నట్లు తాజాగా పేర్కొంది. జాబితాలో ఎంపీఎస్, వైబ్‌గ్యోర్ గ్రూప్‌లతోపాటు, టవర్ ఇన్ఫోటెక్ తదితరాలున్నాయి. ఇన్వెస్టర్ల సొమ్ము రికవరీ నిమిత్తం ఈ నెల 28న వేలం నిర్వహించనున్నట్లు సెబీ వెల్లడించింది. ఇందుకు రూ. 51 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఇతర గ్రూప్‌లలో ప్రయాగ్, మల్టీపర్పస్ బియోస్ ఇండియా, వారిస్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్, పైలాన్ గ్రూప్‌లున్నట్లు సెబీ ప్రకటించింది. వీటికి సంబంధించిన ప్రాపర్టీలను బ్లాక్ చేస్తున్నట్లు నోటీసు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో విస్తరించిన ఈ ఆస్తులలో భూములు, పలు అంతస్తుల భవంతులు, ఫ్లాట్లు, వాణిజ్య కార్యాలయాలున్నట్లు తెలియజేసింది. ఆన్లైన్ మార్గంలో నిర్వహించనున్న ఆస్తుల వేలానికి క్విక్‌ఆర్ రియల్టీ విక్రయ సేవలందించనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థలన్నీ నిబంధనలు పాటించకుండా ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణ చేపట్టినట్లు సెబీ వివరించింది. -
టాటా గ్రూపు కీలక నిర్ణయం... ఒకే గూటికి ఏడు కంపెనీలు
-
స్విస్ చాలెంజ్‌పై ఏడు కంపెనీల ఆసక్తి
ప్రీ బిడ్ సమావేశంలో సందేహాల వ్యక్తీకరణ సాక్షి, అమరావతి: సీడ్ రాజధానిలోని స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పిలిచిన బిడ్‌పై ఏడు సంస్థలు ఆసక్తి కనబరిచాయి. దీనికి సంబంధించి ప్రీ బిడ్ సమావేశం సోమవారం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ, రాంకీ గ్రూపు, అలియన్స్ ఇన్ఫ్రా, చైనాకు చెందిన జీఐఐసీ, చైనా ఫస్ట్ మెటలర్జికల్ కంపెనీలు పాల్గొన్నాయి. సీడ్ రాజధానిలో 6.84 చదరపు కిలోమీటర్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్‌కు చెందిన కన్సార్టియం అసెండాస్-సిన్‌బ్రిడ్జి అండ్ సెంబ్ కార్ప్ డెవలప్మెంట్ కంపెనీ ప్రతిపాదనలు సమర్పించిన విషయం తెలిసిందే. ఇంతకంటె మెరుగైన ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ స్విస్ చాలెంజ్ విధానంలో గత నెల 17న సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఇందులో భాగంగా నిర్వహించిన ఈ ప్రీ బిడ్ సమావేశంలో పాల్గొన్న ఏడు కంపెనీలూ తమ సందేహాలు వ్యక్తం చేశాయి. వీటిని లిఖిత పూర్వకంగా ఇస్తే వాటికి తగిన సమాధానాలను ఇ-ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో పొందుపరుస్తామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలను చాలెంజ్ చేస్తూ సెప్టెంబర్ 1లోపు ఎవరైనా బిడ్లను దాఖలు చేసే అవకాశం ఉంది. సమావేశంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ రామమనోహరరావు, ఎకనామిక్ డెవలప్మెంట్ డెరైక్టర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫార్చ్యూన్-500లో మనవి ఏడు!!
♦ మన ఏడింట్లో నాలుగు చమురు కంపెనీలే ♦ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న వాల్‌మార్ట్ ♦ రెండు, మూడు స్థానాలు చైనా కంపెనీల సొంతం ♦ ఆదాయాన్ని బట్టి కంపెనీల్ని వర్గీకరించిన ఫార్చ్యూన్ న్యూయార్క్: భారత్‌కు చెందిన ఏడు కంపెనీలు తాజాగా ఫార్చ్యూన్-500 ‘ప్రపంచపు అతిపెద్ద కంపెనీల’ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిల్లో నాలుగు ప్రభుత్వానివైతే.. మిగతావి ప్రైవేట్ రంగానివి. ఆదాయం పరంగా కంపెనీల ఎంపిక జరిగిందని ఫార్చ్యూన్ పేర్కొంది. రిటైల్ దిగ్గజం ‘వాల్‌మార్ట్’ 4,82,130 మిలియన్ డాలర్ల ఆదాయంతో జాబితాలో అగ్రస్థానాన్ని సాధిం చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 54.7 బిలియన్ డాలర్ల ఆదాయంతో 161వ స్థానంలో నిలిచింది. ఇండియన్ ఆయిల్ తర్వాతి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి. ఇక యాపిల్ 9వ స్థానంలో నిలిచింది. గతేడాది జాబితాలో స్థానం పొందిన చమురు-గ్యాస్ దిగ్గజం ఓఎన్జీసీ ఈ సారి చోటు కోల్పోయింది. కొత్తగా ఈసారి రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్థానం దక్కించుకుంది. ఫార్చ్యూన్-500 జాబితాలోని కంపెనీలు 6.7 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ.. 33 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటి మొత్తం ఆదాయం గతేడాది 27.6 ట్రిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.