Shabana Begum
-
రెచ్చిపోయిన ఫేస్బుక్ ప్రేమోన్మాది
హైదరాబాద్: ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువతి పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అడ్డువచ్చిన మరో మహిళకు కూడా మంటలంటుకున్నాయి. ఈ సంఘటన హైదరాబాద్ పాతబస్తీలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరివాడిలో నివసిస్తున్న ఆబేదాబేగం, షేక్ ఇస్మాయిల్‌కు ఆరుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. బార్కాస్‌కు చెందిన ఇబ్రహీం(30) వృత్తిరీత్యా మొబైల్ టెక్నీషియన్. గతేడాది ఫేస్బుక్ ద్వారా ఇస్మాయిల్ కూతురు షబానాబేగంతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఈ విష యం తెలుసుకున్న షబానా కుటుంబ సభ్యులు బార్కాస్ కు వెళ్లి విచారించగా అతడికి వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఇరువురిని కలవకుండా చేసి, టప్పాచబుత్రా పోలీ స్స్టేషన్లో ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుందామంటూ ఇబ్రహీం రోజూ ఒత్తిడి తెస్తుండగా షబానాబేగం నిరాకరిస్తోంది. దీంతో శనివారం ఉదయం కుమ్మరివాడిలోని షబానాబేగం ఇంటికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని షబానా బేగంపై పోసి నిప్పంటించుకుని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. షబానా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న షబానా వదిన ఆజిమాబేగం వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి తీవ్ర గాయాలపాలైంది. షబానాబేగం, ఇబ్రహీం,అజిమాబేగంలను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ..
తన అన్నను బుట్టలో వేసుకుని కుటుంబానికి దూరం చేసిందంటూ వదినపై కక్షకట్టిన ఓ యువకుడు ఆమెను చంపేశాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో షబానాబేగం దారుణ హత్యకేసు మిస్టరీని పోలీసులు రెండు రోజుల్లో ఛేదించారు. వివరాలివీ... బిహార్ రాష్ట్రం పట్నాకు చెందిన షబానాబేగంకు నాసిర్‌ఖాన్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. మనస్పర్థలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు. నాసిర్ ఖాన్ మరో వివాహం చేసుకోని బాబుల్‌రెడ్డినగర్‌లో ఉంటుండగా. షబానాబేగం ఇంతియాజ్ ఖాన్(29)ని వివాహం చేసుకుని వేరుగా ఉంటోంది. అయితే, ఇంతియాజ్ ఖాన్ షబానాను వివాహం చేసుకున్న విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పలేదు. తల్లిదండ్రులను, సోదరులను పట్టించుకోకుండా షబానా బేగంతో ఉంటుండటంపై అతని సోదరుడు షేక్ అమీర్ అలీ కక్ష కట్టాడు. షబానాను చంపేందుకు పథకం వేశాడు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుడు మహ్మద్ హతారుద్దీన్(24), షేక్ ఇమ్రాన్ (22)ను తీసుకుని షబానాబేగం ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న షబానాను తాళ్లతో కట్టేసి వెంట తెచ్చుకున్న కత్తితో గాయపరిచి పరారయ్యారు. ఇంతియాజ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... షేక్ అమీర్ అలీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అమీర్ ఆలీ, హతారుద్దీన్, షేక్ ఇమ్రాన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.