వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ.. | The woman murder case mystery | Sakshi
Sakshi News home page

వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ..

Published Thu, Mar 17 2016 7:07 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

The woman murder case  mystery

తన అన్నను బుట్టలో వేసుకుని కుటుంబానికి దూరం చేసిందంటూ వదినపై కక్షకట్టిన ఓ యువకుడు ఆమెను చంపేశాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో షబానాబేగం దారుణ హత్యకేసు మిస్టరీని పోలీసులు రెండు రోజుల్లో ఛేదించారు.

వివరాలివీ... బిహార్ రాష్ట్రం పట్నాకు చెందిన షబానాబేగంకు నాసిర్‌ఖాన్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. మనస్పర్థలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు. నాసిర్ ఖాన్ మరో వివాహం చేసుకోని బాబుల్‌రెడ్డినగర్‌లో ఉంటుండగా. షబానాబేగం ఇంతియాజ్ ఖాన్(29)ని వివాహం చేసుకుని వేరుగా ఉంటోంది. అయితే, ఇంతియాజ్ ఖాన్ షబానాను వివాహం చేసుకున్న విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పలేదు.

తల్లిదండ్రులను, సోదరులను పట్టించుకోకుండా షబానా బేగంతో ఉంటుండటంపై అతని సోదరుడు షేక్ అమీర్ అలీ కక్ష కట్టాడు. షబానాను చంపేందుకు పథకం వేశాడు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుడు మహ్మద్ హతారుద్దీన్(24), షేక్ ఇమ్రాన్ (22)ను తీసుకుని షబానాబేగం ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న షబానాను తాళ్లతో కట్టేసి వెంట తెచ్చుకున్న కత్తితో గాయపరిచి పరారయ్యారు.

ఇంతియాజ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... షేక్ అమీర్ అలీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అమీర్ ఆలీ, హతారుద్దీన్, షేక్ ఇమ్రాన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement