గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం
అనంతపురం జిల్లా పుట్లూరు సమీపంలోని సుబ్బరాయసాగర్లో సోమవారం ఉదయం షాహిద్బాషా(22) అనే యువకుని మృతదేహం లభ్యమైంది. తాడిపత్రికి చెందిన రహంతుల్లా కుమారుడైన షాహిద్బాషా ఆరుగురు స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం సుబ్బరాయసాగర్లో ఈత కొట్టేందుకు వచ్చాడు.
లోతుకు వెళ్లిన షాహిద్ బాషా సాగర్లో మునిగి గల్లంతయ్యాడు. ఆదివారం సాయంత్రం గాలించినా మృతదేహం దొరకలేదు. సోమవారం ఉదయం నీటిలో తేలింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.