బైకును ఢీకొట్టిన టిప్పర్: వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం(కృష్ణా): కృష్ణా జిల్లా కొండపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇబ్రహీంపట్నానికి చెందిన షేక్ ఇమాం షా స్థానికంగా లారీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతడు మంగళవారం సాయంత్రం తన బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఇమాంషా అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించనట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.