ఎస్వీఐటీ విద్యార్థుల ప్రతిభ
హంపాపురం (రాప్తాడు): గత నెల 28న హిందూపురంలోని బిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన నేషనల్ లెవల్ పేపర్ ప్రజెంటేషన్ లో తమ కళాశాల కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ బ్రాంచ్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో నిలిచారని ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి తెలిపారు. సీఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్న పి.రేవతి, బి.శ్రీ పూజిత డేటా స్ట్రక్చర్ పేపర్లో మొదటి బహుమతి సాధించారన్నారు.
రెండవ బహుమతి సీఎస్ఈ విద్యార్థులు ఈ.హర్షిత, జె.రమ్య, ఇంగ్లిష్ కమ్యూనికేష¯ŒS టాపిక్‌లో రెండవ బహుమతిని సీఎస్ఈ మొదటి సంవత్సరం విద్యార్థులు సి.ఆతియా ఆప్రోజ్, ఎం.పూర్ణ సుమత, ఫిజిక్స్‌లో మూడవ బహుమతిని మొదటి సంవత్సరం సీఎస్ఈ విద్యార్థులు కె.షాను, బి.లావణ్య సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులను ఆయనతోపాటు కళాశాల చైర్మ¯ŒS సి.సోమశేఖర్‌రెడ్డి, సి.చక్రధర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, ప్లేస్మెంట్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, పీడీ శ్రీనివాసుల నాయక్ అభినందించారు.