shakthipeeta maha ganapathi
-
శక్తిపీఠాల సందర్శనకు ప్రత్యేక రైలు.. వివరాలు ఇవే..
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి కోసం భారతీయ రైల్వే–ఉలా రైల్ టూరిజం సంయుక్తంగా ‘శక్తి పీఠాల యాత్ర’ చేపట్టినట్లు ట్రావెల్ టైమ్స్ ఎండీ విఘ్నేష్ గణేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న తమిళనాడు నుంచి బయలుదేరే ఈ రైలు గూడూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు మీదుగా సికింద్రాబాద్, ప్రయాగ, వారణాశి, గయ, కామాఖ్య, కోల్కతా పూరి, కోణార్క్ తదితర పుణ్యక్షేత్రాలలో ఉన్న కామాఖ్యదేవి శక్తిపీఠం, వారణాసి విశాలాక్షి శక్తిపీఠం, కోల్కత్తా కాళీ శక్తిపీఠం, అలహాబాద్ అలోపిదేవి శక్తిపీఠం, గయ మంగళగౌరి శక్తిపీఠం, పూరి విమలాదేవి శక్తిపీఠం, కోణార్క్ సూర్యనారాయణ ఆలయంతో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలను చుట్టివస్తుందని పేర్కొన్నారు. 13 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో విజయవాడలో బుకింగ్ చేసుకున్న వారిని బస్సులో గుంటూరు తీసుకెళ్లి రైలు ఎక్కిస్తామని తెలిపారు. ప్రయాణంలో ఉదయం అల్పాహారం, టీ, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా, వసతి ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు. టికెట్ ధర అన్ని పన్నులతో కలసి స్లీపర్ క్లాస్ ఒక్కొక్కరికి రూ.19,950, ఏసీ 3 టైర్ ధర రూ.26,300 ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు విజయవాడలోని తమ కార్యాలయంలో లేదా 74167 18800, 87545 80851 ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరారు. -
ఈసారి శక్తిపీఠ మహాగణపతి
58 అడుగుల ఎత్తులో దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణేశుడు హైదరాబాద్: ఏటా వివిధ రూపాల్లో కొలువుదీరే ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం ‘‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 58 అడుగుల ఎత్తులో రూపొందిస్తున్నట్టు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. శనివారం ఈ మహాగణపతి చిత్రాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. వినాయక చవితి నాటికి ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద సబ్వే పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. ‘శక్తి పీఠాలను దర్శించుకొంటే జ్ఞానం, శక్తి అనుగ్రహం దక్కుతాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో తిరుపతి బాలాజీ, బృందావన సహిత గోవర్ధనగిరిని ఏర్పాటు చేయాలని సూచించా. వీటికి అనుగుణంగానే శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా నామకరణం చేశాం’ అని మేడిపల్లి జ్యోతిర్మయ మహాపీఠం దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఇవీ ప్రత్యేకతలు... నీలి వర్ణంలో నిలిచుని అభయమిచ్చే మహాగణపతి కుడివైపు 18 శక్తిపీఠాలలో మొదటిదైన శ్రీలంకలోని శాంకరీదేవి విగ్రహం, ఎడమవైపు చివరి శక్తిపీఠమైన జమ్ముకశ్మీరులోని సరస్వతి విగ్రహం 10 అడుగుల ఎత్తులో ఉంటాయి. వినాయకుడి వెనుకవైపు భారీ పుట్ట, దానికి ఇరు వైపులా పాలాభిషేకం చేస్తున్నట్టు రెండు ఆవులు, భారీ శివలింగం ఉంటాయి. మహాగణపతిపై పడగవిప్పిన శేషు ఉంటుంది. గణపతి ఆరు చేతుల్లో విష్ణుచక్రం, శంకం, ఆశీర్వాదం, లడ్డూ, గధ, కమలం ఉంటాయి. ఇక గణపతికి ఇరువైపులా 15 అడుగుల ఎత్తులో తిరుమల వెంకన్న, బృందావన సహిత గోవర్ధనగిరిధారుడు దర్శనమిస్తారని శిల్పి రాజేంద్రన్ తెలిపారు.