ఆ అస్థిపంజరం ఎవరిదో..?
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని యువకుని అస్థిపంజరం బయటపడటం కలకలం సృష్టించింది. శంషాబాద్ మండలంలోని పద్మావతి గార్డెన్స్ సమీపంలో సోమవారం యువకుని అస్థిపంజరం లభ్యమైంది. అయితే అస్థిపంజరం ఉన్న స్థితిని పరిశీలిస్తే.. హత్యచేసి పాతిపెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
దాంతో అక్కడి స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. రంగప్రవేశం చేసిన పోలీసలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.