క్రూడ్ దిగుమతులపై భారత్, ఇరాన్ ఒప్పందం
దుబాయ్ : క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఇరాన్ తో భారత్ కు ఒప్పందాలు కుదిరాయి. రోజుకు 350 వేల బ్యారెల్ కంటే ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ను సరఫరా చేసేందుకు ఇరాన్ సమ్మతించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అనంతరం ఇరాన్ ఇంధన మంత్రి ఈ విషయాన్ని తెలిపినట్టు షనా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
దక్షిణ ఇరాన్ ప్రాంతంలో చబాహర్ పోర్టు కోసం 20 బిలియన్ డాలర్లు భారత్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని కూడా తెలిపింది. ఆయిల్, గ్యాస్, పెట్రో కెమికల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి భారత కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ మంత్రి చెప్పారు.