మంత్రాల నెపంతో గోర్లకాపరిపై హత్యాయత్నం
నార్కట్పల్లి : మంత్రాలు చేస్తున్నాడని గొర్ల కాపరిపై హత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని శాపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బరిగేల యాదయ్య కోంత కాలం నుంచి గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడాని ప్రజల్లో ఆరోపణలు ఉన్నట్లు అందులో భాగంగా మంగళవారం యాదయ్య తన గోర్లను మేత కోసం వ్యవసాయ భూముల వద్దకు తీసుకేళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఆతనిపై హత్యాయత్నం చేసినట్లు తెలిపారు. సోమ్మసిల్లి పడి పోయిన యాదయ్యను 108 వాహనంలో చికిత్స నిమిత్తం కామినేని అస్పత్రికి తరలించినట్లు తెలిపారు. దాడి చేసిన వ్యక్తులను పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఐ మోతిరామ్ తెలిపారు.