share listing
-
మజగావ్ డాక్ లిస్టింగ్ అదరహో
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ షేర్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఈ షేర్ ఇష్యూ ధర రూ.145తో పోల్చితే 49 శాతం లాభంతో రూ. 216 వద్ద బీఎస్ఈలో లిస్టయింది. చివరకు 19 శాతం లాభంతో రూ. 173 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,489 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 36 లక్షలు, ఎన్ఎస్ఈలో 4 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ కంపెనీ ఐపీఓ 157 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. పేలవంగా యూటీఐ ఏఎమ్‌సీ లిస్టింగ్ యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో బలహీనంగా లిస్టయ్యాయి. బీఎఎస్‌ఈలో యూటీఐ ఏఎమ్‌సీ షేర్ ఇష్యూ ధర రూ. 554తో పోల్చితే 12 శాతం నష్టంతో రూ.490 వద్ద లిస్టయింది. ఇంట్రడేలో 15 శాతం నష్టంతో రూ. 471 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 14 శాతం నష్టంతో రూ. 477 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6,043 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 13.7 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో కోటికి పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ ఐపీఓ 2.3 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. -
ఎండ్యురాన్స్ టెక్ లిస్టింగ్ మెరుపులు
37 శాతం లాభంతో ముగిసిన షేర్ న్యూఢిల్లీ: వాహన విడిభాగాలు తయారు చేసే ఎండ్యురాన్స్ టెక్నాలజీస్ షేర్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. బీఎస్ఈలో ఈ షేర్ ఇష్యూ ధర, రూ.472తో పోల్చితే 21 శాతం లాభంతో రూ.570 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 39 శాతం(రూ.655) వరకూ ఎగసిన ఈ షేర్ చివరకు 37 శాతం లాభంతో రూ.648 వద్ద ముగిసింది. బుధవారం మార్కెట్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,111 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 81 లక్షలు, ఎన్ఎస్ఈలో 3 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఈ నెల 5న ప్రారంభమై 7న ముగిసిన ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా ఈ కంపెనీ రూ.1,161కోట్ల నిధులు సమీకరించింది. రూ.467-472 ధర శ్రేణితో వచ్చిన ఈ ఐపీఓ 44 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో భాగంగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ యాక్టిస్ 1.93 కోట్ల షేర్లను, ప్రమోటర్ 53.17 లక్షల షేర్లు.. మొత్తం 2.46 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో జారీ చేశారు. ఈ ఐపీఓకు యాక్సిస్ క్యాపిటల్, సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా సంస్థలు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించాయి. ఈ కంపెనీ ద్వి, త్రి చక్ర వాహనాలకు అవసరమైన విడిభాగాలను తయారు చేస్తోంది. ఇటలీ, జర్మనీల్లో ప్లాంట్లున్నాయి.