Shea Team
-
షీ టీంలతో ఈవ్‌టీజర్లకు చెక్
బోయినపల్లి(చొప్పదండి) : జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎస్పీ విశ్వజీత్ కంపాటి పేర్కొన్నారు. గురువారం రాత్రి బోయినపల్లి పోలీస్‌స్టేన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల తో మాట్లాడుతూ ఒకప్పుడు ఫిర్యాదు చేయడానికే జంకే ప్రజలు.. కళాశాలల్లో ఆకతాయిల వేధింపులతో భయపడే యువతులు పోలీసులు ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు ఉపయోగించుకుంటున్నార ని తెలిపారు. పెట్టెల ద్వారా వచ్చిన ఫిర్యాదులతో ఇప్పటివరకు ఆరుగురిపై కేసులు నమో దు చేసినట్లు చెప్పారు. ఈవ్టీజర్ల ఆటకట్టిం చేందుకు షీ టీంలు సుడిగాలిలా తిరుగుతున్నాయన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు వందకుపైగా ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా ప్రయత్నిస్తున్నామ న్నారు. ఆయన వెంట వేములవాడ రూరల్ సీఐ వీ.మాధవి, ఎస్సై వీ. శేఖర్ ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం సహించం పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పోలీస్‌స్టేన్ ఆకస్మిక తనిఖీ లో భాగంగా ఆయన రికార్డులు పరిశీలించారు. ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు. స్టేషన్ లో ఎస్హెచ్ఓలు సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. శాభాష్‌పల్లి బ్రిడ్జీ పరిశీలన కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో ఉన్న మండలంలోని శాభాష్‌పల్లి పాత లోలెవల్ వంతెనను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజిత్ గురువారం రాత్రి పరిశీలించారు. వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి పర్వదినానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో వంతెనపై భారీ వాహనాలు వెళ్తే వంతెన రక్షణగా ఉంటుందా అనే అంశం పరిశీలించారు. అలాగే వంతెనపై ట్రాఫిక్ జామ్ కాకుండా చేపట్టాల్సిన చర్యలు పరిశీలించారు. -
మహిళలకు అండగా షీ టీం
డీఎస్పీ మల్లారెడ్డి ఉట్నూర్ రూరల్ : మహిళలు, విద్యార్థినులకు అండగా షీ టీంలు పని చేస్తున్నాయని డీఎస్పీ మల్లారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కుమ్రంభీం కాంప్లెక్స్ ఆవరణలో బాలికల మేనేజ్మెంటు హాస్టల్ విద్యార్థినులకు షీటీంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలు, విద్యార్థినులపై వేధింపులు పెరిగాయని వాటి నివారణకు ప్రభుత్వం షీ టీంలు ఏర్పాటు చేసిందని తెలిపారు. కళాశాల, మార్కెట్, షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఆకతారుులు ఆగడాలు చేస్తే 100కు సమాచారం అందించాలని తెలిపారు. వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థినులు హాస్టళ్లలో ఫోన్లు వినియోగించరాదని, ఫోన్లు వినియోగించిన వారిపై నిఘా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బుచ్చయ్య, వార్డెన్ ప్రమీల, బీఏడ్ కళాశాల ప్రిన్సిపాల్ మేస్రం మనోహర్, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెడ్మ భొజ్జు, ఎస్సై మంగిలాల్, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.