షీ టీంలతో ఈవ్‌టీజర్లకు చెక్‌ | Complaint boxes giving good results | Sakshi
Sakshi News home page

షీ టీంలతో ఈవ్‌టీజర్లకు చెక్‌

Published Fri, Feb 3 2017 10:11 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

షీ టీంలతో ఈవ్‌టీజర్లకు చెక్‌

షీ టీంలతో ఈవ్‌టీజర్లకు చెక్‌

బోయినపల్లి(చొప్పదండి) : జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎస్పీ విశ్వజీత్‌ కంపాటి పేర్కొన్నారు. గురువారం రాత్రి బోయినపల్లి పోలీస్‌స్టేన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల తో మాట్లాడుతూ ఒకప్పుడు ఫిర్యాదు చేయడానికే జంకే ప్రజలు.. కళాశాలల్లో ఆకతాయిల వేధింపులతో భయపడే యువతులు పోలీసులు ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు ఉపయోగించుకుంటున్నార ని తెలిపారు. పెట్టెల ద్వారా వచ్చిన ఫిర్యాదులతో ఇప్పటివరకు ఆరుగురిపై కేసులు నమో దు చేసినట్లు చెప్పారు. ఈవ్‌టీజర్ల ఆటకట్టిం చేందుకు షీ టీంలు సుడిగాలిలా తిరుగుతున్నాయన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు వందకుపైగా ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా ప్రయత్నిస్తున్నామ న్నారు. ఆయన వెంట వేములవాడ రూరల్‌ సీఐ వీ.మాధవి, ఎస్సై వీ. శేఖర్‌ ఉన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం సహించం
పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పోలీస్‌స్టేన్ ఆకస్మిక తనిఖీ లో భాగంగా ఆయన రికార్డులు పరిశీలించారు. ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు. స్టేషన్ లో ఎస్‌హెచ్‌ఓలు సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్  పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

శాభాష్‌పల్లి బ్రిడ్జీ పరిశీలన
కరీంనగర్‌–సిరిసిల్ల ప్రధాన రహదారిలో ఉన్న మండలంలోని శాభాష్‌పల్లి పాత లోలెవల్‌ వంతెనను జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజిత్‌ గురువారం రాత్రి పరిశీలించారు. వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి పర్వదినానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో వంతెనపై భారీ వాహనాలు వెళ్తే వంతెన రక్షణగా ఉంటుందా అనే అంశం పరిశీలించారు. అలాగే వంతెనపై ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చేపట్టాల్సిన చర్యలు పరిశీలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement