Complaint boxes
-
ఆకతాయిల ఆటకట్టు.. పాఠశాలల్లో ఫిర్యాదు బాక్స్‌లు
ఆకివీడు(పశ్చిమగోదావరి): రాష్ట్రంలో ఆడపిల్లల భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థినుల భద్రత కోసం.. వారికి భరోసా కల్పిస్తూ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తోంది. కొందరు ఆకతాయిలు విద్యార్థినులను వేధించడం వంటి చర్యలకు పాల్పడినప్పుడూ ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేయకుండా ఈ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తున్నాయి. చదవండి: ఆయిల్ ఫామ్ సాగుతో డబ్బులే డబ్బులు.. పెట్టుబడులు పోగా ఎకరానికి లాభం ఎంతంటే? ప్రతీ పాఠశాల వద్ద ఇలాంటి బాక్సులు ఏర్పాటు చేయాలి. అలాగే బాలికలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల వద్ద ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయించారు. ఎవరైనా తప్పుడు ఉద్దేశంతో ముట్టుకున్నా, తాకినా వెంటనే తల్లిదండ్రులకు గాని, పెద్దలకు తెలియజేయాలంటూ ఫ్లెక్సీలో సూచించారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులపై చర్యలు పాఠశాల వద్ద ఉన్న ఫిర్యాదుల బాక్సులో రాత పూర్వకంగా విద్యార్థినులు సమాచారాన్ని తెలియజేయాలి. ఈ బాక్సుల్లోని ఫిర్యాదులను ఎప్పటికప్పుడూ ఎంఈవో పరిష్కరిస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాక్సుల్లో ఫిర్యాదులను పరిశీలించి ఎంఈవోకు సమాచారమిస్తారు. ఎంఈవో ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 418 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 63,638 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. క్తొతగా ప్రారంభించిన 16 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లోని విద్యార్థినులతో పాటు 36 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 4,420 మంది, ప్రైవేటు విద్యా సంస్థల్లో సుమారు 22,570 మంది విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. వీరికి అభయం కల్పిస్తూ ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో ప్లెక్సీలు, బోర్డుల ఏర్పాటు బాలికలు, విద్యార్థినులకు రక్షణగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం పలు ఉచిత కాల్ సెంటర్ నెంబర్లు అందుబాటులో ఉంచింది. వేధింపులకు గురైనా, శరీరంపై చేయి వేసినా చైల్డ్ లైన్ నెంబరు 1098, పోలీస్ 100, దిశ హెల్ఫ్‌లైన్ నెంబర్ 112, ఉమెన్ హెల్ప్‌లైన్ 181కు ఫిర్యాదు చేయవచ్చు. దురుసుగా ప్రవర్తించినా, అసభ్యకరంగా మాట్లాడినా ఆ సమయంలో విద్యార్థునులు ఏం చేయాలో అవగాహన కలి్పస్తూ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు. రక్షణ చర్యలు భేష్ బాలికల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయి. పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సు వల్ల ఈవ్ టీజింగ్ తగ్గుతుంది. బాలికలు నిర్భయంగా పాఠశాలకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు. – ఎన్.సిరి సన్నిత్య, 8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, ఆకివీడు వేధింపులకు అడ్డుకట్ట విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పిస్తున్న సీఎం జగనన్నకు కృతజ్ఞతలు. మహిళలు, బాలికలకు పూర్తి రక్షణకల్పించి వారి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఫిర్యాదుల బాక్సులు, హెల్ప్లైన్ల ఏర్పాటుతో వేధింపులకు అడ్డుకట్ట పడుతుంది. – ఎండీ.బషీరా, జెడ్పీ హైస్కూల్, ఆకివీడు పాఠశాలల్లో ఫిర్యాదు బాక్సులు బాలికా సంరక్షణ పథకం ద్వారా బాలికలు, విద్యార్థినులకు పూర్తి రక్షణ ఏర్పడుతుంది. ప్రతీ పాఠశాలలో ఫిర్యాదుల బాక్సు, హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉంచుతున్నాం. లైంగిక వేధింపులకు గురి చేసే వారికి శిక్ష పడేలా ఇవి దోహదపడతాయి. విద్యార్థినుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – డీ.వెంకట రమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం -
స్కూళ్లలో బాలలపై లైంగిక వేధింపులకు చెక్
సాక్షి అమరావతి: సుప్రీంకోర్టు, హైకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ ఆదేశాల మేరకు సూళ్లలో పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. లైంగిక వేధింపులు, పోక్సో చట్టం గురించి పిల్లల్లో అవగాహన కల్పించాలని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో పోస్టర్లు, ఫిర్యాదు పెట్టెలు ఉంచాలని తెలిపింది. విద్యార్థులందరికీ కనిపించేలా పోస్టర్లు ఉంచాలని, తగిన పరిమాణంలో తగిన మెటీరియల్‌తో కూడిన ఫిర్యాదు పెట్టె హెడ్మాస్టర్ గది వెలుపల ఉంచాలని సూచించింది. ఫిర్యాదులను ఈ పెట్టెలో వేయవచ్చు. ఇతర ప్రధాన సూచనలు పోస్టర్లలో ఏకరూపత ఉండాలి. పోస్టర్ల ముద్రణ, ఫిర్యాదు పెట్టె కోసం పాఠశాల నిర్వహణ గ్రాంట్ నుండి నిధులు తీసుకోవచ్చు. తాళం ఉండే ఏదైనా చిన్న పెట్టెను ఫిర్యాదు పెట్టెగా ఉపయోగించవచ్చు మండల విద్యాధికారి, ఇతర విభాగాల అధికారుల సమక్షంలో సమీపంలోని పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్, ఏఎన్ఎం 15 రోజులకు ఒకసారి ఫిర్యాదు పెట్టెను తెరిచి, అందులో ఉన్న ఫిర్యాదులను చదవాలి ఫిర్యాదుపై అవసరమైన చర్యలకు వారు సంబంధిత శాఖకు తెలపాలి ఏ విధంగానూ, ఏ సమయంలోనూ ఫిర్యాదుదారు వివరాలను బహిర్గతం చేయకూడదు. అత్యంత గోప్యంగా ఉంచాలి. ఎంఈవోలు డీఈవోలకు రెగ్యులర్ రిపోర్టును పంపాలి డీఈవో ప్రతి నెలా 1, 15 తేదీల్లో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కి నివేదిక పంపాలి (చదవండి: ‘డిజిటల్’ ఫిష్: ‘ఫిష్ ఆంధ్ర’కు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ) -
ప్రజల ముంగిట ఫిర్యాదు బాక్సులు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో భారీ ప్రక్షాళన మొదలైంది. క్షేత్రస్థాయి నుంచి అవినీతి నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. వివిధ సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు విద్యుత్తు శాఖ కార్యాలయాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి గురువారం తెలిపారు. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా వినియోగదారులు కమిషన్ దృష్టికి పలు అంశాలను తెచ్చారు. కొత్త కనెక్షన్లు, తప్పుగా ముద్రించిన విద్యుత్తు బిల్లులు, ట్రాన్స్ఫార్మర్లు మార్చుకునేందుకు వినియోగదారులు రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. లో వోల్టేజీ, వేలాడే విద్యుత్ తీగలతో సమస్యలు ఎదురవుతున్నట్లు ఏపీఈఆర్సీ దృష్టికి తెచ్చారు. దీనిపై కిందిస్థాయి సిబ్బంది వెంటనే స్పందించడం లేదనే ఫిర్యాదులందాయి. సిబ్బంది అవినీతి వ్యవహారాలపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తూ కమిషన్ చర్యలు చేపట్టింది. ఫిర్యాదు బాక్సులు ఇలా... ►ప్రతి అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), అడిషనల్ డివిజినల్ ఇంజనీర్ (ఏడీఈ), జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) కార్యాలయాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తారు. ►ఫిర్యాదు బాక్సుల తాళాలు పై అధికారుల వద్ద మాత్రమే ఉండాలని నిబంధన విధించారు. ►ప్రతి నెల మొదటి తారీఖున ఫిర్యాదు బాక్సులను తెరిచి వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలి. ►ఫిర్యాదు వివరాలు ఉన్నతాధికారులకూ వెళ్తాయి. ►ఫిర్యాదును గుర్తించిన 48 గంటల్లోగా పరిష్కారం చూపించాలి. అది కూడా సంస్థ వెబ్సైట్లో పేర్కొనాలి. ►ఫిర్యాదు చేసే వ్యక్తులు కరెంట్ బిల్లు, పూర్తి వివరాలను అందులో పొందుపర్చాలి. ►అవసరమైతే జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకూ ఫిర్యాదులు పంపవచ్చు. ►ఫిర్యాదు బాక్సులపై అన్ని విద్యుత్ సంస్థల వెబ్పోర్టర్లలో ప్రజలకు అర్థమయ్యేలా వివరాలు వెల్లడించాలి. ►అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించకపోయినా, లంచాల కోసం వేధించినా ఫిర్యాదు చేయవచ్చు. కఠిన చర్యలుంటాయి ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై ప్రతి మూడు నెలలకోసారి ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతుంది. ఫిర్యాదుల వివరాలు, అపరిష్కృతంగా ఉంటే కారణాలను వెల్లడించాలి. ఏపీఈఆర్సీ ఈ వ్యవస్థను స్వయంగా పర్యవేక్షిస్తుంది. మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినా, విద్యుత్ వినియోగదారులను లంచాల కోసం వేధించినా కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యుత్ వ్యవస్థ తమదనే భావన ప్రజలకు కల్పించడం కోసమే సరికొత్త చర్యలు చేపట్టాం. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ -
చిత్తూరు పోలీసుల వినూత్న ఆలోచన
సాక్షి, తిరుపతి(చిత్తూరు) : రాష్ట్రంలో మహిళలపై వేధింపులు అధికమవుతున్న నేపథ్యంలో.. చిత్తూరు జిల్లాలో పోలీసులు నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సలహాపై జిల్లా మొత్తం ఫిర్యాదు బాక్స్‌లను అమర్చారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులకు మధ్య మెరుగైన సంబంధాలు ఏర్పడాలనే ఉద్దేశంతో జిల్లా పరిధిలో మొత్తం 95 ఫిర్యాదు బాక్స్‌లను ఏర్పాటు చేశామని, జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. రద్దీ ప్రదేశాలైన పాఠశాలలు, బస్టాండ్స్, మార్కెట్, ఆలయాలు వంటి ప్రాంతాలతోపాటు, ప్రతి పోలీస్ స్టేషన్లో 5 ఫిర్యాదు బాక్స్‌లను అమర్చారని పేర్కొన్నారు. వీటి పర్యవేక్షణ పూర్తిగా స్పెషల్ బ్రాంచ్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఫిర్యాదు బాక్స్‌లను తెరిచి ఫిర్యాదులను ఎస్పీ గారికి తెలియజేస్తామని, అంతేకాక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
షీ టీంలతో ఈవ్‌టీజర్లకు చెక్
బోయినపల్లి(చొప్పదండి) : జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎస్పీ విశ్వజీత్ కంపాటి పేర్కొన్నారు. గురువారం రాత్రి బోయినపల్లి పోలీస్‌స్టేన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల తో మాట్లాడుతూ ఒకప్పుడు ఫిర్యాదు చేయడానికే జంకే ప్రజలు.. కళాశాలల్లో ఆకతాయిల వేధింపులతో భయపడే యువతులు పోలీసులు ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు ఉపయోగించుకుంటున్నార ని తెలిపారు. పెట్టెల ద్వారా వచ్చిన ఫిర్యాదులతో ఇప్పటివరకు ఆరుగురిపై కేసులు నమో దు చేసినట్లు చెప్పారు. ఈవ్టీజర్ల ఆటకట్టిం చేందుకు షీ టీంలు సుడిగాలిలా తిరుగుతున్నాయన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు వందకుపైగా ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా ప్రయత్నిస్తున్నామ న్నారు. ఆయన వెంట వేములవాడ రూరల్ సీఐ వీ.మాధవి, ఎస్సై వీ. శేఖర్ ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం సహించం పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పోలీస్‌స్టేన్ ఆకస్మిక తనిఖీ లో భాగంగా ఆయన రికార్డులు పరిశీలించారు. ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు. స్టేషన్ లో ఎస్హెచ్ఓలు సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. శాభాష్‌పల్లి బ్రిడ్జీ పరిశీలన కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో ఉన్న మండలంలోని శాభాష్‌పల్లి పాత లోలెవల్ వంతెనను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజిత్ గురువారం రాత్రి పరిశీలించారు. వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి పర్వదినానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో వంతెనపై భారీ వాహనాలు వెళ్తే వంతెన రక్షణగా ఉంటుందా అనే అంశం పరిశీలించారు. అలాగే వంతెనపై ట్రాఫిక్ జామ్ కాకుండా చేపట్టాల్సిన చర్యలు పరిశీలించారు.