తాగుడికి బానిసై వ్యక్తి బలవన్మరణం
బాపట్ల(గుంటూరు): తాగుడికై బానిసై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాపట్లకు చెదిన పాటూరి. శేఖర్, భార్య పిల్లలు ఈ ఏడాది జూన్26న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే శేఖర్‌కు ఉన్న వ్యసనాలతో వారు బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. వారు మృతి చెందినప్పటి నుంచి మరింతగా తాగుడికి బానిసైన శేఖర్ ఈరోజు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు.