నోట్ బుక్‌పై శిల్పాశెట్టి ఫోటో
పూణే: పూణేలోని ఓ ప్రముఖ స్కూల్లో ఓ విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతనికి ఆ స్కూల్ వాళ్లు ఇచ్చిన పుస్తకాలపై శిల్పాశెట్టి ఫోటోలు ముద్రించి ఉన్నాయి. ఆ స్కూల్ ప్రిన్సిపల్‌ని ఈ అంశంపై కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే.. పిల్లలు టీవీల్లోనే ఆమెను చూస్తున్నారు కదా?.. పుస్తకంమీద చూస్తే తప్పేంటి అని సమాధానమిచ్చారు..
ఈ సంఘటన ప్రముఖ నటి ,నిర్మాత, దర్శకురాలు రేణుదేశాయ్‌కి తన మేనల్లుడు విషయంలో ఎదురైన అనుభవం. ఈ విషయాన్ని రేణుదేశాయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరికొందరి పుస్తకాలపై సన్నీలియోన్, బిపాసాబసుల ఫొటోలు కూడా ఉన్నాయట. విద్యార్థుల పుస్తకాలపై ఇలాంటి ఫొటోలు ముద్రించడం చూస్తే విద్యకన్నా..వినోదానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
This is a notebook given frm a reputed school of my nephew for 9th std! &we r wondering why this generation is weird😣 pic.twitter.com/ICtzHqn4FO
— R (@renuudesai) June 7, 2015
@trulymaheshh some more with Bipasha Basu &Sunny Leone too!!!when questioned d principal replied that kids are watching them already on tv!!
— R (@renuudesai) June 7, 2015