Shiv Lal Yadav
-
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వినోద్‌తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (TACB) దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్ల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం వినోద్ సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి నివాసంలోనూ ఈడీ సోదాలు జరిపింది. వివేక్ కంపెనీ ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. వివేక్, వినోద్ దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి (కాకా) కుమారులు. -
ఉబర్ కేసు చార్జిషీట్‌పై విచారణ
న్యూఢిల్లీ: గత నెల ఐదో తేదీన మహిళా ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారం కేసులో నిందితుడు శివ్లాల్యాదవ్పై దాఖలైన చార్జిషీట్‌పై స్థానిక న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. విచారణ అనంతరం ఈ కేసును మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్... స్థానిక సెషన్స్ కోర్టుకు బదిలీచేశారు. కేసు తదుపరి విచారణను ఏడో తేదీకి వాయిదా వేశారు. మరోవైపు ఈ కేసులో నిందితుడు యాదవ్‌కు స్థానిక పోలీసులు చార్జిషీట్‌ను అందజేశారు. గుర్గావ్లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే బాధితురాలు ఉబర్ క్యాబ్‌లో ఇంటికి వస్తుండగా డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్ ప్రాంతంలో చోటుచేసుకున్న సంగతి విదితమే. అత్యాచార ఘటన జరిగిన 19 రోజుల తర్వాత నిందితుడిపై స్థానిక న్యాయస్థానంలో పోలీసులు అభియోగపత్రాన్ని దాఖలు చేశారు.