ఉబర్ కేసు చార్జిషీట్‌పై విచారణ | Uber Case to be Heard by Fast Track Court | Sakshi
Sakshi News home page

ఉబర్ కేసు చార్జిషీట్‌పై విచారణ

Published Mon, Jan 5 2015 11:02 PM | Last Updated on Thu, Aug 30 2018 9:11 PM

Uber Case to be Heard by Fast Track Court

 న్యూఢిల్లీ: గత నెల ఐదో తేదీన మహిళా ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారం కేసులో నిందితుడు శివ్‌లాల్‌యాదవ్‌పై దాఖలైన చార్జిషీట్‌పై స్థానిక న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. విచారణ అనంతరం ఈ కేసును మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్... స్థానిక సెషన్స్ కోర్టుకు బదిలీచేశారు. కేసు తదుపరి విచారణను ఏడో తేదీకి వాయిదా వేశారు. మరోవైపు ఈ కేసులో నిందితుడు యాదవ్‌కు స్థానిక పోలీసులు చార్జిషీట్‌ను అందజేశారు. గుర్గావ్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే బాధితురాలు ఉబర్ క్యాబ్‌లో ఇంటికి వస్తుండగా డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్ ప్రాంతంలో చోటుచేసుకున్న సంగతి విదితమే. అత్యాచార ఘటన జరిగిన  19 రోజుల తర్వాత నిందితుడిపై స్థానిక న్యాయస్థానంలో పోలీసులు అభియోగపత్రాన్ని దాఖలు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement