shiva laxmi
-
చిల్లర వసూల్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చిల్లర శ్రీవుహాలక్ష్మీ... అన్నట్లుగా జిల్లా పంచాయుతీ శాఖ చిన్న చిన్న మొత్తాల్లో వసూళ్లకుపాల్పడుతోంది. పోస్టింగ్‌లు.. పదోన్నతులు.. దొరికిన చోటల్లా జేబులు నింపుకునే పని పెట్టుకుంది. తాజాగా జిల్లాలో 63 వుంది గ్రేడ్-3 పంచాయుతీ కార్యదర్శులకు గ్రేడ్-2 కార్యదర్శులుగా ప్రమోషన్లు కల్పించారు. నిబంధనల ప్రకారం పదోన్నతి కల్పించే సవుయుంలో వీరిని వేరే చోటికి బదిలీ చేయూలి. కానీ ప్రమోషన్లు అందుకున్న కార్యదర్శులు తవు సీట్లు వదిలేందుకు వివుుఖత ప్రదర్శించారు. ఎలాగైనా ఉన్నచోటనే ఉండాలని తవువం తుగా పైరవీలు ప్రారంభించారు. అవసరాన్ని ఆసరాగా చేసుకున్న అధికారులు తవు చేతులు తడిపితే బదిలీ చేయుకుండానే ప్రమోషన్లు ఇస్తావుని ఆఫర్ ఇచ్చినట్లు అభియోగాలున్నారుు. ఎలాగైతేనేం.. ఎంతోకొంత సవుర్పించుకుంటే తవు సీటు పదిలవువుతుందనే ఆరాటంతో ప్రమోషన్లు అందుకున్న కార్యదర్శులు సైతం ఒక్కొక్కరు రూ.5 వేల చొప్పున వుుట్టజెప్పినట్లు తెలుస్తోంది. డబ్బులిచ్చిన వారికి ఎన్నికలయ్యే దాకా డోకా లేదని పంచాయుతీ విభాగం సైతం భరోసా ఇస్తోందని సవూచారం. దీంతో డబ్బులిస్తేనే తవుకు బదిలీ వేటు తప్పుతుందని ప్రమోషన్లు అందుకున్న వారు తోచినంత ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వురోవైపు 45 ఏళ్లు నిండినవారు డిపార్టుమెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకున్నా పదోన్నతి పొందేందుకు అర్హులవుతారనే నిబంధనలున్నారుు. వీటిని అధికారులు పట్టించుకోకపోవటంతో అర్హులైన కొందరు గ్రేడ్-3 కార్యదర్శులు పదోన్నతిని కోల్పోరుునట్లు వివుర్శలు వ్యక్తవువుతున్నారుు. దీంతో వీరందరూ కోర్టును ఆశ్రరుుంచేందుకు సన్నద్ధవువుతున్నారు. గత నెలలోనూ ఇదే తీరుగా పంచాయుతీ విభాగం చెడ్డపేరు తెచ్చుకుంది. గత నెలలో జిల్లాలో పని చేస్తున్న కాం ట్రాక్టు కార్యదర్శులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. స్వయూనా పంచాయుతీరాజ్ విభాగం 84 వుందిని రెగ్యులరైజ్ చేస్తూ పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వీరికి పోస్టింగ్‌లు ఇచ్చే విషయుంలోనూ వుుడుపుల బాగోతం సాగిందనే ఆరోపణలున్నారుు. బదిలీ చేయుకుండా.. వీరిని సైతం ఉన్న చోటనే రెగ్యులర్ చేసేందుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు పుచ్చుకున్నట్లు ప్రచారం జరిగింది. తవు చేతికి వుట్టి అంటకుండా అధికారులు ఈ వసూళ్ల బాధ్యతను సైతం కార్యదర్శుల విభాగంలో పెత్తనం వహిస్తున్న వారికే అప్పగించినట్లు తెలుస్తోంది. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ వసూల్ వ్యవహారాలు పంచాయుతీ విభాగం పనితీరును బజారున పడేస్తున్నారుు. -
కూతురును కంటావా
రాజుపాళెం, న్యూస్‌లైన్: ఆడపిల్లను కనిందని కట్టుకున్న భార్యను గెంటేసిన భర్త ఉదంతమది. మండలంలోని గాదెగూడూరు గ్రామానికి చెందిన మహేంద్రారెడ్డి భార్య శివలక్ష్మిని గెంటేశాడు. మూడునెలల క్రితం శివలక్ష్మి ఆడపిల్లకు జన్మనిచ్చింది. గర్భవతిగా ఉన్న సమయంలో స్కానింగ్ చేయించగా ఆడపిల్ల అని తెలియడంతో భర్త, అత్త, మామల నుంచి శివలక్ష్మికి వేధింపులు మొదలయ్యాయి. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన శివలక్ష్మికి 2009 నవంబరు 23వ తేదీన రాజుపాళెం గాదెగూడూరు గ్రామానికి చెందిన గొంగటి మహేంద్రారెడ్డితో వివాహమైంది. అప్పట్లో వరకట్నం కింద రూ.2.50 లక్షలు డబ్బు ఇచ్చారు. దాంతో బంగారు నగలను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి సజావుగా సాగిన సంసారంలో రెండేళ్ల నుంచి చిన్నపాటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో శివలక్ష్మి గర్భవతి అయింది. అడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని కోరారు. పెళ్లయిన చాలా ఏళ్లకు గర్భం వస్తే అబార్షన్ చేయించుకోమంటారా అంటూ శివలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. మూడు నెలల అనంతరం తిరిగి కాపురానికి రావడంతో శివలక్ష్మిని ఇంట్లోకి రానీయకుండా చేశారు. మూడు రోజులుగా శివలక్ష్మి ఇంటి ఆరుబయటే పడిగాపులు కాస్తోంది. సంఘటనపై రాజుపాళెం ఎస్ఐ సుబ్బారావు విచారణ చేపట్టారు. భర్త, మామలతో మాట్లాడారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. దీంతో పాపతో పాటు శివలక్ష్మిని ఇంట్లోకి తీసుకెళ్లారు.