shoratage
-
మీ డెబిట్, క్రెడిట్ కార్డులు జాగ్రత్త.. పోగొట్టుకుంటే మళ్లీ కష్టమే!
మీకు డెబిట్, క్రెడిట్ కార్డులు బ్యాంకుల నుంచి రావాలంటే ఎంత సమయం పడుతుంది... డెబిట్ కార్డు కోసమైతే..రెండు లేదా మూడు రోజులు పట్టొచ్చు. కొన్ని బ్యాంకులయితే వెంటనే అకౌంట్ తీసిన రోజే డెబిట్ కార్డును జారీ చేస్తాయి. క్రెడిట్ కార్డు కోసమైతే.. అన్ని వెరిఫీకేషన్లు పూరైన వెంటనే బ్యాంకులు కార్డును జారీ చేస్తాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు పోతే బ్లాక్ చేసి రెండు, మూడురోజుల్లో బ్యాంకులనుంచి తిరిగి సులువుగా పొందవచ్చుననీ అనుకుంటున్నారా..! భవిష్యత్తులో అలా కుదరదు. తీవ్ర చిప్స్ కొరతతో కార్డుల ఉత్పత్తికి ఆటంకం..! రానున్న రోజుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను బ్యాంకులు వెంటనే జారీ చేయకపోవచ్చును అసలు డెబిట్, క్రెడిట్ కార్డులను ఇవ్వకపోవచ్చును. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్ కొరతతో డెబిట్, క్రెడిట్ కార్డుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడబోతుందని వ్యాపార నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 3 బిలియన్ల డెబిట్, క్రెడిట్ కార్డులను కంపెనీలు తయారుచేస్తున్నాయి. సుమారు 90 శాతం మేర నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి కార్డులను తయారుచేసే కంపెనీలు ప్రస్తుతం తీవ్ర చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి. చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థ , మొబైల్ చెల్లింపుల సంస్థలు చిప్‌ల కొరతను నివారించడానికి, సరఫరా పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ తెచ్చినా తంటాలు...! కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం చిప్ తయారీదారులు కార్యకలాపాలను పూర్తిగా మూసివేయవలసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చిప్స్ కొరత ఏర్పడింది. చిప్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల కోసం ఆకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది. చిప్స్ కొరత ఏర్పడడంతో సెమీకండక్టర్ పరిశ్రమ దెబ్బతింది. చిప్స్ కొరతతో పలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం నెలకొన్న ఈఎంవీ చిప్స్ కొరతతో డెబిట్, క్రెడిట్ కార్డుల ఉత్తత్తికిభారం కానుంది. దీంతో భవిష్యత్తులో బ్యాంకుల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డుల జారీకి ఆటంకం ఏర్పడునుందని ట్రేడ్ యూనియన్ తెలిపింది. కాగా ప్రస్తుతం చిప్స్ కొరత 2022 సంవత్సరం వరకు కొనసాగనుందని చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థలు , మొబైల్ చెల్లింపుల సంస్థలు పేర్కొన్నాయి. సో ప్రస్తుతం ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కడపడితే అక్కడే పొగ్గొట్టుకున్నారో ఇక అంతే సంగతులు. చదవండి: Debit Card EMI: మీకు అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోండి..? -
రేషన్ కొరత..
చాలని సరుకులు కార్డుదారుల ఇబ్బందులు పత్తాలేని పామాయిల్ గోధుమలదీ అదేపరిస్థితి కానరాని కందిపప్పు అరకొర చక్కెర మేడిపెల్లి: గ్రామీణ ప్రాంతాలు వర్షాలు లేక అల్లాడుతున్నాయి. పంటలు పండక రైతు కుటుంబాల వలస బాటపట్టాయి. పల్లెను పట్టుకుని ఉంటున్న జనం రేషన్ దుకాణాల ద్వారా అందే సరుకుల ఆధారంగా ఆకలి తీర్చుకుంటున్నారు. అయితే, పేదలకు అందాల్సిన నిత్యావసరాలు సక్రమంగా పంపిణీ కావడంలేదు. దీంతో కార్డుదారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. మేడిపెల్లి మండలంలో 15,995 ఆహార భద్రత కార్డులుండగా 41,346మంది లబ్ధిదారులు ఉన్నారని రికార్డులు చెబుతున్నాయి. సరుకులు పంపిణీ చేయడానికి 28 రేషన్‌షాప్‌లు ఏర్పాటు చేశారు. ప్రనెలా 2,723 క్వింటాళ్ల బియ్యం, 159 క్వింటాళ్ల చక్కెర, 15,144 పామాయిల్ ప్యాకెట్లు, 15,995 క్వింటాళ్ల గోధుమలు, 15,995 లీటర్ల కిరోసిన్, 15,995 కిలోల కందిపప్పు సరఫరా కావాల్సి ఉంది. ఆర్నెల్లుగా సరుకులు సక్రమంగా రావడంలేదు. బియ్యం, కిరోసిన్‌నే సరిపెడుతున్నారు. జూలైలో కేవలం బియ్యం, చక్కెరే పోశారు. ఇదేమిటని డీలర్లను అడిగితే.. పైనుంచి రాలేదని చెబుతున్నారు. అసలే కరువు.. ఆపై చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు.. కూలీనాలీ చేసుకునే పేదలు బహిరంగ మార్కెట్లో పెద్దమెుత్తంలో ధరలు చెల్లించి నిత్యావసరాలు కొనుగోలు చేయలేకపోతున్నారు. రేషన్ దుకాణం, బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు(కిలో రూ.లలో) సరుకు రేషన్‌దుకాణం మార్కెట్ చక్కెర 13.50 40 గోధుమపిండి 16 30 పామాయిల్ 40 80 చింతపండు 60 120 కందిపప్పు 50 150 పేదల కడుపుకొడుతున్నరు – పుల్లూరి దేవయ్య, గోవిందారం వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు రేషన్‌షాపుల్లో అన్ని సరుకులు ఇచ్చిండ్రు. పేదలకు రెండుపూటలా కడుపునిండా తిండి దొరికేది. ఇప్పుడు సరుకులు సరిగా ఇస్తలేరు. కిరాణాల్లో ఎక్కువ ధర పెట్టి కొనుడైతంది. తొమ్మిది సరుకులిచ్చిండ్రు – జంగంపెల్లి విజయ్, మోత్కురావుపేట కాంగ్రెస్ హయాంలో నూటా ఎనబై ఐదు రూపాయలకే తొమ్మిది రకాల సరుకులను రేషన్‌షాపుల ద్వారా అందజేసింది. పేదప్రజలకు అవసరమైన నిత్యావసరాలు తక్కువ ధరకే వచ్చినయి. ఇప్పుడు బియ్యమే ఇస్తే ఏం లాభం? గోదాముల నుంచి రావడంలేదు – కె.వసంత, తహసీల్దార్ అన్ని సరుకుల కోసం రేషన్ డీలర్లు డీడీలు చెల్లించారు. గోదాముల్లోనే సరుకులు లేవు. పైనుంచి సరుకులు రావడం లేదు. ఉన్నవాటినే కార్డుదారులకు అందజేస్తున్నాం. ఈనెలలో బియ్యం, కిరోసిన్, చక్కెర వచ్చింది. వాటిని పంపిణీ చేశాం.