ఏడడుగుల సంబంధం...
రామచంద్రపురం :
స్థానిక పదంవారివీధిలో క్రీస్తు సంఘం చర్చిలో మరుగుజ్జుల జంట వివాహం చేసుకుని ఒక్కటైంది. కాకినాడకు చెందిన పులిదిండి తాతారావు (4 అడుగులు)కు పట్టణానికి చెందిన బూల మాధవి (3 అడుగులు)లకు చర్చి పాస్టర్ నందిక ప్రసాద్ పెద్దల సమక్షంలో వివాహం చేశారు. వీరిద్దరూ మరుగుజ్జులు కావడంతో ప్రభుత్వం సహకారాన్ని అందించి ఆదుకోవాలని పెద్దలు కోరారు. పెద్దలు కొమ్ము అబ్బులు, కొమ్ము నాగేశ్వరరావు, కొమ్ము సురేష్, మడికి చాయా, చాపల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.