Shrija
-
పవన్‌ను కలిసిన శ్రీజ
హైదరాబాద్: బ్రెయిన్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకున్న ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన శ్రీజ తన కుటుంబ సభ్యులతో సోమవారం జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను ఆయన కార్యాలయంలో కలిసింది. గతేడాది బ్రెయిన్ ఫీవర్ కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడిన శ్రీజ తన అభిమాన నటుడు పవన్‌ను చూడాలనుందని కోరడంతో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ చొరవతో ఆయన స్వయంగా ఖమ్మం వెళ్లి శ్రీజను పరామర్శించిన విష యం తెలిసిందే. అప్పటి నుంచి డాక్టర్ అసాధారణ్ పర్యవేక్షణలో వైద్య చికిత్సలు పొందిన శ్రీజ పూర్తిగా కోలుకుంది. సోమవారం శ్రీజతో పాటు ఆమె తల్లిదండ్రులు నాగయ్య, నాగమణి, సోదరి షర్మిల శ్రీలత పవన్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు వారితో పవన్ కల్యాణ్ గడిపారు. శ్రీజ పూర్తిగా కోలుకొని, ఆరోగ్యవంతంగా ఉండడం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. శ్రీజకు చికిత్స చేసి నయమయ్యేలా చేసిన డాక్టర్ అసాధారణ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. -
పవన్ కల్యాణ్ అభిమాని శ్రీజ డిశ్చార్జ్
హైదరాబాద్: బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతూ ఖమ్మం లోని కార్తీక్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందిన పవన్ కల్యాణ్ అభిమాని శ్రీజను డాక్టర్లు డిశ్చార్జి చేశారు. కుటుంబసభ్యులు ఆమెను పాల్వంచ తీసుకువెళ్లారు. చిన్నారి పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న సినీ హీరో పవన్‌కల్యాణ్ అక్టోబర్ 17న ఆస్పత్రికి వచ్చి పరామర్శించిన విషయం విదితమే. ఆమె కోలుకోవడంతో పవన్ అభిమానులు ఆస్పత్రిలో స్వీట్లు పంచిపెట్టారు. -
పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీజ కోలుకుంది..
-
పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీజ కోలుకుంది..
ఖమ్మం: అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన శ్రీజ కోలుకుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్ కేర్ నుంచి బయటకు వచ్చిందని డాక్టర్ అసాధారణ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. పాల్వంచకు చెందిన శ్రీజ అక్టోబర్ 2న బ్రెయిన్ ఫీవర్‌తో కోమాలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అనారోగ్యంతో ఉన్న ఆమె అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌ను చూడాలనుందని తండ్రి నాగయ్యకు చెప్పింది. శ్రీజ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. తన కూతురికి పవన్‌ను చూడాలని ఉందని, చిన్నారి తండ్రి మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి పవన్ స్పందించారు. అక్టోబర్ 17న ఖమ్మం వచ్చి శ్రీజను చూశారు. కోలుకున్నాక మరోసారి వచ్చి చూస్తానన్నారు. కాగా, ప్రస్తుతం శ్రీజ కోలుకుంది. తన బిడ్డకు మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లకు, పవన్‌కు శ్రీజ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. -
స్కూల్ వ్యాన్ బోల్తా
ఒక స్కూల్ వ్యాన్ బోల్తాపడటంతో పది మంది విద్యార్థులు గాయపడిన సంఘటన మర్రిపూడి మండలంలో శనివారం జరిగింది. చెంచిరెడ్డిపల్లి నుంచి 54 మంది విద్యార్థులతో బయలుదేరిన స్కూల్‌వ్యాన్ ఆర్కే పల్లి రోడ్డు నుంచి టంగుటూరు-పొదిలి ఆర్అండ్బీ రహదారి వద్ద మలుపు తిరుగుతుండగా బోల్తాపడింది. మర్రిపూడి : ఓ స్కూల్ వ్యాన్ బోల్తాపడటంతో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన అంకేపల్లి రోడ్ నుంచి టంగుటూరు-పొదిలి ఆర్అండ్బీ రహదారి వద్ద శనివారం జరిగింది. వివరాలు.. పొదిలికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ మండలంలోని చెంచిరెడ్డిపలి ్లనుంచి బయల్దేరి కూచిపూడి, అంకేపల్లి గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుని పొదిలి బయల్దేరింది. ఆ సమయంలో వ్యాన్‌లో సుమారు 54 మంది విద్యార్థులు ఉన్నారు. అంకేపల్లి రోడ్ నుంచి టంగుటూరు-పొదిలి ఆర్అండ్బీ రహదారి వద్ద మలుపు తిరుగుతుండగా వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేయకుండా డ్రైవర్ వీరారెడ్డి పరారయ్యాడు. విద్యార్థుల అరుపులు.. కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏడుపులు.. కేకలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వ్యాన్ అద్దాలు పగుగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. గాయపడిన పాలుగుండ్ల శ్రీజ, రామిరెడ్డి, బోదా మధు, యూ.సుదర్శ్‌న్‌రెడ్డి, దామిరెడ్డి సింహాద్రి, బాదం శైలజతో పాటు మరో ముగ్గురు విద్యార్థులను 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెన్నపూస సురేష్‌కు చెయ్యి గూడ జారింది. పాలుగుండ్ల శ్రీజ కాలుకు తీవ్రగాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. వ్యాన్ బోల్తాపడిన ప్రదేశంలో మైలురాయి అడ్డుపడటంతో ప్రాణాపాయం తప్పింది. పర్లంగ్ రాయిలేకుంటే వ్యాన్ మరో రెండుమూడు పల్టీలు కొట్టి లోతైన గుంతలో పడేదని, ప్రాణ నష్టం కూడా జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సై బీవీవీ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
పవన్ రాకతో పోటెత్తిన అభిమానులు
ఖమ్మం క్రైం: విషమ పరిస్థితిలో ఉన్న తన చిన్నారి అభిమానిని పరామర్శించేందుకు సినీ నటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నగరానికి వచ్చారు. ఎన్ఎస్టీ రోడ్డులో గల కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బండి శ్రీజ(12)ను ఆయన పరామర్శించారు. పవన్ కల్యాణ్ వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి వద్ద పోలీసులు గురువారం అర్ధరాత్రి నుంచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తోపులాట పవన్ కల్యాణ్‌ను చూసేందుకు జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో వచ్చిన అభిమానులతో ఆస్పత్రి పరిసరాలు కిటకిటలాడాయి. వారిని అదుపుచేయలేక పో లీసులు నానా అవస్థలు పడ్డారు. అభిమానులకు, పోలీసులకు మధ్య పలుమార్లు తోపులాట జరిగిం ది. పోలీసుల రోప్ పార్టీని పవన్ అభిమానులు నెట్టివేసి ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు పలుమార్లు లాఠీచార్జి చేశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆస్పత్రిలోకి పవన్ కల్యాణ్ వెళ్లేముందు, బయటకు వచ్చేప్పుడు ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అభిమానుల తాకిడి, తోపులాటతో ఆస్పత్రి వెనుకవైపునగల గోడ కూలడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రోగులకు ఇక్కట్లు పవన్ కల్యాణ్ రాక సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం, అభిమానులు పోటెత్తడంతో కార్తీక్ సూపర్ స్పెషాలిటీకి వచ్చిన రోగులు లోపలికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. లోపలికి వెళ్లేందుకు వారిని పోలీసులు అనుమతించలేదు. పవన్, చిరంజీవి అభిమాన సంఘ నాయకులను కూడా పోలీసులు ఆస్పత్రిలోకి వెళ్లనీయలేదు. మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు కేరింతలు కొట్టారు. దీంతో, ఆయన మాట్లాడింది ఎవరికీ అర్థం కాలేదు. ఆయన నిముషం లోపే మాట్లాడి వెళ్లిపోయారు. -
ఆత్మీయ స్పర్శ :పవన్‌కల్యాణ్
ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తన అభిమానిని పరామర్శించేందుకు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ శుక్రవారం ఖమ్మం బాట పట్టారు. విశాఖపట్టణం నుంచి నేరుగా ఆయన మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు. బ్రెయిన్‌ఫీవర్‌తో బాధపడుతున్న శ్రీజ(12) అనే బాలిక చివరి కోరికను తన ఆత్మీయ స్పర్శతో నెరవేర్చారు. సుమారు గంటపాటు ఆస్పత్రి లో గడిపి ఆ చిన్నారి ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. ‘శ్రీజ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా..’ అని పవన్ భావోద్వేగాల మధ్య ప్రకటించారు. పవన్ రాకతో ఆస్పత్రి పరిసరాలు ఆయన అభిమానులతో నిండిపోయాయి. వారిని అదుపుచేయటం పోలీసులకు కష్టమైంది. ఖమ్మం: ‘జిల్లాలోని పాల్వంచకు చెందిన శ్రీజ (12) అనే బాలిక బ్రెయిన్‌ఫీవర్‌తో బాధపడుతోంది. కొద్దిరోజులుగా ఆమెకు ఖమ్మంలోని కార్తీక్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తున్నారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంలేదు. తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను చూడాలని ఆ చిన్నారి కోరిక. ఆమె తల్లిదండ్రులు, నాగయ్య, నాగమణి తమ కూతురు చివరి కోరిక తీర్చాలని పవన్‌కల్యాణ్‌ను మీడియా ద్వారా కోరారు. ఖమ్మం రావాల్సిందిగా అభ్యర్థించారు. పవన్ స్పందించారు. తన అభిమాని కోసం కదలివచ్చారు. ఆ బాలికను పరామర్శించేందుకు శుక్రవారం ఖమ్మం వచ్చిన పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. తన అభిమాని ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందని..తనను చూడాలంటోందని తెలిసిన వెంటనే విశాఖపట్టణం నుంచి పవన్ నేరుగా ఖమ్మం వచ్చారు. పవన్రాకను తెలుసుకున్న అభిమానులు ఆస్పత్రి వద్ద గుమిగూడారు. కార్తీక్ ఆస్పత్రి నలుదిక్కుల ఉన్న వీధులు పోటెత్తాయి. భవనాలపైకి ఎక్కి పవన్ కోసం నిరీక్షించారు. బందోబస్తు నడుమ ఆస్పత్రిలోకి.. పరిస్థితిని గమనించి ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న సమయంలో ఖమ్మానికి చేరిన పవన్‌ను పోలీసులు అతికష్టమ్మీద ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వెనుకభాగంలో ఉన్న లిఫ్ట్ నుంచి పవన్ హాస్పిటల్లోకి వెళ్లారు. శ్రీజను చూశారు. ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. ‘మృత్యువుకు చేరువలో ఉన్న తన అభిమాని చివరి కోరిక తీర్చలేకుండా ఉండలేకపోయాను..’ అన్నారు. శ్రీజ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి డాక్టర్ అసాధరణ్ను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స చేయాలని కోరారు. ‘ఆమె బతికితే తిరిగి ఖమ్మం వస్తాను. ఆ చిన్నారితో మాట్లాడి వెళ్తాను. భగవంతుడు శ్రీజకు ప్రాణం పోయాలని ప్రార్థిస్తున్నాను.’ అని పవన్ భావోద్వేగాల మధ్య ప్రకటించారు. తమ కూతురి ఆరోగ్యం గురించి పరితపించిన పవన్‌కల్యాణ్‌ను చూసి శ్రీజ తల్లిదండ్రులు కన్నీరుపెట్టారు. తమ కుమార్తె చివరి కోరిక తీర్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు గంటసేపు పవన్ ఆస్పత్రిలోనే గడిపారు. అశేష అభిమానులు, వారి కేరింతలకు స్పందించి చేతులూ ఊపుతూ ఆస్పత్రి నుంచే అభివాదం చేశారు. ఆస్పత్రికి వచ్చేటప్పుడు కారులో వచ్చిన ఆయన అభిమానుల ఉత్సాహాన్ని చూసి కారుపైకి ఎక్కి వారికి అభివాదం చేశారు. పవన్ అభిమానులను ఆపడం పోలీసులకు కష్టతరమైంది. లాఠీలకు సైతం పని చెప్పాల్సి వచ్చింది. పవన్ రాక విషయం తెలిసి ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర మధ్యాహ్నభోజనం కోసం ఏర్పాట్లు చేశారు. పవన్ అంగీకరించినా అభిమానులు, భద్రతాపరమైన ఇబ్బందుల వల్ల రవిచంద్ర ఇంటికి వెళ్లలేకపోయారు. రవిచంద్ర కుమారుడు నితిన్ బైపాస్‌రోడ్‌లో పవన్‌కల్యాణ్ ఆపి మార్గంమధ్యలో భోజనం చేయాల్సిందిగా తయారు చేసిన వంటకాలను అందించారు. పవన్ వెంట పవన్‌కల్యాణ్, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు కొప్పురావూరి సుమంత్, రుద్రగాని ఉపేందర్, వీరేశ్, ఉపేందర్చౌదరి, గంగిశెట్టి శ్రీను ఉన్నారు.