పవన్‌ను కలిసిన శ్రీజ | sreeja meet with pavankalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ను కలిసిన శ్రీజ

Published Tue, Apr 21 2015 12:06 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

పవన్‌ను కలిసిన శ్రీజ - Sakshi

పవన్‌ను కలిసిన శ్రీజ

హైదరాబాద్: బ్రెయిన్ ఫీవర్  నుంచి పూర్తిగా కోలుకున్న ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన శ్రీజ తన కుటుంబ సభ్యులతో సోమవారం జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను ఆయన కార్యాలయంలో కలిసింది. గతేడాది బ్రెయిన్ ఫీవర్ కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడిన శ్రీజ తన అభిమాన నటుడు పవన్‌ను చూడాలనుందని కోరడంతో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ చొరవతో ఆయన స్వయంగా ఖమ్మం వెళ్లి  శ్రీజను పరామర్శించిన విష యం తెలిసిందే.

అప్పటి నుంచి డాక్టర్ అసాధారణ్ పర్యవేక్షణలో వైద్య చికిత్సలు పొందిన శ్రీజ పూర్తిగా కోలుకుంది. సోమవారం శ్రీజతో పాటు ఆమె తల్లిదండ్రులు నాగయ్య, నాగమణి, సోదరి షర్మిల శ్రీలత పవన్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు వారితో పవన్ కల్యాణ్ గడిపారు. శ్రీజ పూర్తిగా కోలుకొని, ఆరోగ్యవంతంగా ఉండడం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. శ్రీజకు చికిత్స చేసి నయమయ్యేలా చేసిన డాక్టర్ అసాధారణ్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement